పవన్‌: జనసేన క్యాడర్ ఆవేదన పట్టించుకోవా సేనానీ?

ఎలాగైనా అధికార వైసీపీని గద్దె దించాలి.. ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో చంద్రబాబు కూటమిని ఏర్పాటు చేశారు. ముందుగా జనసేనతో పొత్తు పెట్టుకొని ఆ తర్వాత బీజేపీని ఇందులోకి చేర్చుకున్నారు. అయితే సీట్ల సర్దుబాటు తర్వాత కూటమిలో విభేదాలు మొదలయ్యాయి. ఒకే నియోజకవర్గంలోని మూడు పార్టీల ఇన్ఛార్జిల ఉండటం వల్ల తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కేటాయింపులో భాగంగా సీటు రాని నేతలు ఆరోపిస్తున్నారు.

ఇవి కూటమిలోని మూడు పార్టీల అధినేతలకు తల నొప్పిగా మారాయి. గతంలో కార్యకర్తలు ఏం మాట్లాడినా చాలా తక్కువ మందికి తెలిసేది. కానీ ప్రస్తుతం వారి ఆవేదనంతా సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో క్షణాల్లో ఇవి వైరల్ గా మారుతున్నాయి. తాజాగా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన బస చేసిన హోటల్ దగ్గర పవన్ ను కలిసేందుకు యత్నించిన అభిమానుల మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇందులో వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

పవన్ కల్యాణ్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. ఎవరెవరో వస్తున్నారు. కనీసం ఏర్పాట్లు సరిగా చేయలేదు. జనాలంతా జనసేన క్యాడర్ ను తిడుతున్నారు. కానీ ఏర్పాట్లన్నీ టీడీపీ నాయకులు చేస్తున్నారు. మాటలు ఏమో మనకి. పొత్తు వల్ల ఎవరెవరి చేతో మాటలు పడాల్సి వస్తుంది అని అందులో ఉంది.

మరో ఆడియోలో ఇంకో జనసేన అభిమాని పవన్ కల్యాణ్ గారితో హోటల్ లో సమావేశం ఉందని చెప్పి వార్డుకి ఇద్దరి నాయకుల చొప్పున పేర్లు రాసుకొని వెళ్లారు. ఇలా పేర్లు తీసుకున్న నాయకులు, వీర మహిళలు ఆ హోటల్ వద్ద బయట పడిగాపులు కాస్తున్నారు. వీరందరనీ లోపలకి రానివ్వకుండా సెక్యూరిటీ అడ్డుకున్నారు. అదే సమయంలో టీడీపీ ఇన్ ఛార్జి వర్మ తన అనుచరులతో భారీ ఎత్తున లోపలకి వెళ్లారు.  కానీ జనసైనికులు, వీర మహిళలు అలానే గేటు వద్ద ఉండిపోవాల్సి వచ్చింది.  పార్టీ కోసం సేవ చేసినా కనీస మర్యాద కూడా దక్కలేదని వారంతా వాపోతున్నారు. మరి పవన్ దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: