చంద్రబాబు: ఆ దిగజారుడు మాటలెందుకు వస్తున్నాయో?

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో నాయకుల మధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైంది. వైసీపీ అధినేత మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్రలు, రోడ్ షోలు నిర్వహిస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజా గళం పేరిట ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో సింగనముల నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా చంద్రబాబు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ వైసీపీ తమ అభ్యర్థిగా ఆ పార్టీకి సుదీర్ఘకాలంగా నిజాయతీ పరుడిగా పనిచేస్తున్న సాధారణ కార్యకర్త వీరాంజనేయులను ప్రకటించింది.  అయితే టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులకి టికెట్ ఇవ్వడంపై చంద్రబాబు సెటైర్లు వేశారు. జగన్ టిప్పర్ డ్రైవర్లకి, వేలి ముద్ర గాళ్లకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇస్తే గిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకో.. లేక ఇతరులకో ఇవ్వాలి కానీ టిప్పర్ డ్రైవర్లకి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.

అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బడుగు, బలహీన వర్గాల పార్టీగా చెప్పుకునే టీడీపీ ఆ ఆశయంతోనే సీనియర్ ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన విషయాన్ని చంద్రబాబు నాయుడు మరిచిపోయారని పలువురు గుర్తు చేస్తున్నారు. అంటే సాధారణ కార్యకర్తలు, డ్రైవర్లు, వెనుకబడిన వర్గాల వారు రాజకీయాల్లోకి రాకూడదా అని ప్రశ్నిస్తున్నారు.  చంద్రబాబు వారిని అవమానించడమే అని పేర్కొంటున్నారు.

మొత్తం మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అహంకార పూరితంగా ఉన్నాయని.. ఇవి ఆయన స్థాయికి, వయసుకి తగవని పలువురు చెబుతున్నారు. ఇది టీడీపీ విధానానికి వ్యతిరేకం అని వివరిస్తున్నారు. అంటే తెలుగుదేశం విధానాలు మారిపోయాయా.. లేక చంద్రబాబు వాటిని మార్చేశారా అని ప్రశ్నిస్తున్నారు.  మరోవైపు ఈ వ్యాఖ్యల పట్ల వైసీపీ ఘాటు గానే రిప్లై ఇచ్చింది. సింగనముల అభ్యర్థి ఎంఏ, ఎకనామిక్స్ చేసి బీఈడీ చేసిన విద్యావంతుడు అని.. బాబు హయాంలో ఉద్యోగం రాక టిప్పర్ డ్రైవర్ అయ్యారని ఎద్దేవా చేశారు. పేదవాడికి సీఎం జగన్ టికెట్ ఇస్తే ఈ విధంగా అవహేళన చేయడం సరైంది కాదని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: