కూటమి లెక్కలు: జగన్‌తో పోలిస్తే బాబోరు అట్టర్‌ ఫ్లాప్‌?

ఏపీలో ఇటీవల టీడీపీ ఫైనల్ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఇప్పటి వరకు ప్రకటించి పెండింగ్ లో ఉన్న పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఏపీలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న ఎన్డీయే కూటమి ఆ మేరకు అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రచారం పర్వంలోకి అడుగు పెట్టింది.

మరో వైపు అధికార వైసీపీ ఇప్పటికే 175 అసెంబ్లీ, 25 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి అటు ప్రచారంలోను, అభ్యర్థులను ప్రకటనలో ముందు వరుసలో ఉన్నారు. అయితే సీఎం జగన్ అభ్యర్థుల జాబితాలో ఎక్కువగా సోషల్ ఇంజినీరింగ్ కే ప్రాధాన్యం ఇచ్చారు. దాదాపు 100 సీట్లను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలకు ఇచ్చి బీసీల పార్టీగా చెప్పుకునే టీడీపీకి సవాల్ విసిరారు. మరి వీటికి మించి లేదా సమానంగా అయినా కూటమి తమ జాబితాల్లో జగన్ మాదిరి సోషల్ ఇంజినీరింగ్ కు స్థానం కల్పిస్తుందని భావిస్తే వారికి నిరాశే ఎదురైంది.

మొత్తంగా కూటమి పార్టీలు ప్రకటించిన సీట్ల లెక్కలు పరిశీలిస్తే టీడీపీ ఎస్సీలకు 25, ఎస్టీలకు 3, బీసీలకు 31, మైనార్టీలకు మూడింటిని కేటాయించింది. జనరల్ స్థానాల్లో కమ్మ సామాజిక వర్గానికి 30, రెడ్డిలకు 28, కాపులకు 8, క్షత్రియలకు 5, వైశ్యలకు రెండు, వెలమ సామాజిక వర్గానికి ఒక సీటు కేటాయించింది.

జనసేన విషయానికొస్తే ఎస్సీ లకు మూడు, ఎస్టీలకు ఒకటి, బీసీలకు రెండు, ఓసీలకు 12,  అందులో కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణలకు ఒక్కోటి చొప్పున, కాపు, బలిజలకు తొమ్మిది సీట్లను ప్రకటించింది. బీజేపీ పది స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ లకు ఒక్కోటి చొప్పున, బీసీలకు రెండు, కమ్మ సామాజిక వర్గానికి మూడు, రెడ్డిలకు ఒకటి, క్షత్రియ రెండు స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టారు.  మరి చంద్రబాబు బీసీలను ఏ మేర కన్విన్స్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: