రేవంత్‌ రెడ్డి: ఆ విషయంలో చంద్రబాబు బాటలోనే..?

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఇసుక కొరత రావద్దన్న ఉద్దేశంతో స్థానిక అవసరాలకు, సొంత ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుక వాడుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇసుక లభ్యత లేదన్న కారణంతో ఇంటి నిర్మాణాలు ఆగిపోకూడదని పేర్కొంది. ఇందుకోసం స్థానిక అవసరాల నిమిత్తం వాగుల్లోని ఇసుకను ఉచితంగా తీసుకెళ్లేందుకు అవకాశం కల్పిస్తూ మైనింగ్ డిపార్ట్ మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది.

సీఎం గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇసుక పై ప్రత్యేక దృష్టి సారించారు. గత నెలలో జరిగిన రివ్యూలో ఇసుక అమ్మకాలకు కొత్త విధానం తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు. అయితే ఈ మేరకు తాజాగా మైనింగ్ శాఖ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో నిర్మాణాలకు ఆటంకం లేకుండా స్థానిక వాగుల్లోంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా, ఎడ్లబండ్ల ద్వారా రవాణా చేసుకోవచ్చని తెలిపింది. వివిధ గ్రామాల నుంచి ప్రజల ద్వారా విజ్ఙప్తులను పరిశీలించి తదుపరి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహేశ్ దత్ వివరించారు.

ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి బాటలో సీఎం రేవంత్ రెడ్డి పయనిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక అవసరాల కోసం ఇసుకను వాడుకోవచ్చని ఉత్తర్వులు ఇచ్చారు. దీనిని అడ్డుపెట్టుకొని కొంత  మంది అక్రమార్కులు దీనిని దుర్వినియోగ పరిచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
 
బిల్డర్ కు తప్ప రోజూ ఇసుక అవసరం ఎవరికీ ఉండదని గుర్తు చేస్తున్నారు. ఈ స్థానిక అవసరాలు అనేది ఎవరు నిర్ధారిస్తారు అనే దానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం ఇసుక ధర క్రమక్రమంగా పెరిగిపోతుంది. ఇలా కాకుండా జిల్లాల వారీగా లేదా ఇసుక రీచ్ ల వారీగా కొంతమందికి కాంట్రాక్ట్ ఇచ్చి  లేదా యువతను ఉపాధి అవకాశం కల్పించి ఒక్కో లారీ లేదా ట్రాక్టర్ కు ను ఇసుక రీచ్ వద్ద లోడ్ చేసుకునేలా చేసి కొంత ధర నిర్ణయిస్తే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు యువతకు ఉపాధి చూపినట్లవుతుందని పలువురు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: