సస్పెన్స్‌: పవన్‌.. సీఎం అంటే.. సెంట్రల్‌ మినిస్టరా?

పవన్  కల్యాణ్ గురించి రోజుకో వార్త ప్రచారం జరుగుతుంది. ఆయన ఎంపీగా పోటీ చేస్తారని కొందరు అంటుంటే. లేదు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారు అని మరి  కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేగా బరిలో నిలుస్తారు అని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు. తద్వారా కేంద్రంలోకి వెళ్తారని అభిమానులు అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై పార్టీ అధ్యక్షుడిగా నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం పవన్ కల్యాణే. కానీ ఆయన ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఎంపీ, ఎమ్మెల్యే పోటీపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు పార్టీ పెద్దలు తనను ఎంపీగా కూడా పోటీ చేయాలని కోరారని తెలిపారు. తనకు మనసులో మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని తెలిపారు. ఎంపీగా పోటీ చేస్తానో? లేదో కొద్ది రోజుల్లోనే తెలుస్తుందని అన్నారు. బీజేపీకి సీట్లు ఇవ్వడం వల్ల జనసేన ఎక్కువ సీట్లు నష్టపోవాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డారు.

అయితే పార్టీ కార్యకర్తలతో మాట్లాడే సమయంలో ఆలోచిస్తే మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. టీడీపీతో పొత్తు కోసం బీజేపీ పెద్దలతో చివాట్లు తిన్నానని పవన్ వ్యాఖ్యానించారు. మరోవైపు వైసీపీ నాయకులు చంద్రబాబు కోసమే పవన్ పనిచేస్తున్నారని ఆరోపిస్తున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు వారికి బలం చేకూర్చినట్లవుతుంది. డామినేషన్ రోల్ నేనే పోషిస్తాను అని పలు సందర్భాల్లో పవన్ పేర్కొన్నారు. కానీ పొత్తుల వల్ల నేనే నష్టపోయాను అని వివరిస్తున్నారు. ఇలా పరస్పరం విరుద్ధ వ్యాఖ్యల ద్వారా ఆయనకే నష్టం కలిగే అవకాశం ఉంది.

ఇప్పుడు తాజాగా ఎంపీ గా పోటీ చేసే విషయమై పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. కాకినాడ ఎంపీగా ఆయన బరిలో ఉంటారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  పార్టీ పెద్దలు అంటే ఎవరు అనేది ఇక్కడ అర్థం కానీ  ప్రశ్న. జనసేనకు పవన్ అధ్యక్షుడు. ఆయనే నిర్ణయం తీసుకోవాలి. అదే టీడీపీలో అయితే చంద్రబాబు, వైసీపీ అయితే జగన్ నిర్ణయాలు తీసుకుంటారు.  కానీ పవన్ వ్యవహారం డిఫరెంట్. అంటే ఆయన పోటీ విషయంపై  చంద్రబాబు అనుమతి కావాలా అని కొందరు సెటైర్లు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: