ప్రలోభాలు: జనం తప్పా.. పార్టీలు తప్పా?

యథా రాజా.. తథా ప్రజా అంటారు. అంటే రాజు ఎలా ఉంటారో ప్రజలు కూడా అలాగే వ్యవహరిస్తారు అని. కానీ ప్రజాస్వామ్యం యథా ప్రజా.. తథా రాజా అనే విధంగా మారిపోయింది.  ప్రజలు ఏ విధంగా ఉంటే పాలకులు వారికి అనుగుణంగా మారిపోతున్నారు. ప్రస్తుతం ఏపీలో తాయిలాల పర్వం కొనసాగుతుంది.

ఈ మేరకు ఎల్లో మీడియా వైసీపీ నాయకులు భారీగా ఉచితాలు, వస్తువులు పంచుతున్నారు అని వార్తలు రాసుకొచ్చింది. ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియా టీడీపీ నేతలు డబ్బులు పంపిణీ చేస్తున్నారు అంటూ వాటిని ప్రెజక్ట్ చేసే పనిలో పడ్దారు. ఇంతకీ పంచనది ఎవరు. వీరంతా ఎవరికి ఇస్తున్నారు. తీసుకుంటుంది ఎవరు. వీటన్నింటికి ఏక వాక్య సమాధానం ప్రజలు. వీరంతా మాకు ఏ గిఫ్ట్ లు వద్దు. మా కష్టార్జితం మాకు చాలు. ఎన్నికల్లో తాయిలాలు, మద్యం వంటి వాటికి ఆశపడకుండా ఓటు వేస్తాం అని ఏ ఒక్క ఓటరు చెప్పడం లేదు.

మీ పరిపాలన చూసి నేను ఓటేస్తాను. నేను నీతిగా, నిజాయతీగా డబ్బులు తీసుకోకుండా ఓటు వేస్తాను అని ఏ ఓటరు అనడం లేదు. అలా ఎవరూ ఉండటం లేదు. నూటికి ఒక్కరో.. ఇద్దరో ఇలాంటి వాళ్లు దొరుకుతారు. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే.. ఇద్దరి దగ్గర ఇచ్చినవి తీసుకొని నచ్చిన వారికి ఓటేద్దాం అనే ఆలోచనతో ఓటర్లు ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో రాజకీయ నాయకులు ఏం చేయాలి.

ఒకవేళ నీతి నిజాయతీతో ఎన్నికల్లో నిలబడి, ఓట్లుకు డబ్బులు పంచకుండా ఉండే వ్యక్తికి ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు. వీరిని ప్రజలు పట్టించుకోరు. ఒకవేళ ప్రజా ప్రతినిధులు అయిన తర్వాత కూడా తమ పనిచేసి పెట్టాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఈ తప్పుకు ఎవరు బాధ్యులు. డబ్బులు తీసుకొని ఓటుస్తున్న వారిదా. లేక డబ్బున్న నాయకులకే టికెట్టు ఇస్తున్న పార్టీలదా.. డబ్బులు ఎలాగూ పంచాం కాబట్టి వాటిని ఎలాగైనా తిరిగి సంపాదించుకోవాలనుకునే ప్రజాప్రతినిధులదా. ఆలోచించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: