అయ్యో.. ఆ ప్రచారంతో టీడీపీకి తీరని నష్టం?

వైసీపీ సర్కారుపై ఎల్లో మీడియా రెచ్చిపోతుంది. ఎన్నికల్లో సీఎం జగన్ ను ఎలాగైనా గద్దె దించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో పాటు ఎల్లో మీడియా కూడా తనదైన శైలిలో కృషి చేస్తోంది. ఓ వైపు సిద్ధం సభలు విజయవంతం అయితే అదంతా గ్రాఫిక్స్ అని.. సభలో చివరి ఫొటోలు తీసి జనం అంతగా లేరని.. గ్రీన్ మ్యాట్లు వేసి వీఎఫ్ ఎక్స్ చేస్తున్నారని విషపు రాతలు రాస్తున్నారు.

రోజూ వైసీపీపై ఏదో ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. సిద్ధం సభలకు డబ్బులు పంచుతున్నారు. మద్యం పంపిణీ చేస్తున్నారు. తాయిలాలు ఆశగా ఎర చూపుతున్నారు వంటివి నిత్యం ఆయా పేపరల్లో ఓ భాగం అయిపోయాయి. కాకపోతే అటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇవేమీ పంచకుండానే ఎన్నికలకు వెళ్తున్నారా.. లేక డబ్బులు ఇవ్వకుండానే స్వచ్ఛందంగానే టీటీపీ సభలకు జనాలు వస్తున్నారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. తాము చేయోచ్చు..కానీ ప్రత్యర్థి పార్టీ చేస్తే తప్పు.

ఒక్కమాటలో చెప్పాలంటే జనాలు కూడా వీటికి అలవాటు పడిపోయారు. ఒకవేళ వీళ్లు వార్తలు రాసి వారికి ఆ తాయిలాలు అందకుండా చేస్తే ప్రజలే తిరగబడతారు. మాకు వచ్చే రూపాయిని ఎందుకు నిలిపివేస్తున్నారు అని. ఇలా రోజూ రాయడం వల్ల టీడీపీ కి ప్రయోజనం కంటే కూడా నష్టం చేకూరుస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ నాయకులు మందు, డబ్బులు, బిర్యానీ ఇచ్చి మళ్లీ రేపటి రోజు ఎన్నికల సమయంలో మళ్లీ డబ్బులు పంచుతారు.

వీటన్నింటిని రోజూ రాయడం వల్ల తెలుగుదేశం సానుభూతి పరుల్లో వీటిని కోల్పోతున్నామనే భావన కలుగుతుంది. వైసీపీ టీ షర్టు వేసుకుంటే రూ.వెయ్యి ఇస్తారని రాసుకొచ్చారు. ఇది నిజం అయితే టీడీపీ కార్యకర్తలు కూడా వెయ్యి వస్తున్నాయి కదా వాళ్లు ధరిస్తారు. మరోవైపు వైసీపీ నాయకులు తాయిలాలు ఇస్తున్నారు మీరు కూడా ఇవ్వండి అని టీడీపీ నాయకులపై ఒత్తిడి పెరుగుతుంది. ఇవ్వకపోతే వ్యతిరేకత పెరుగుతుంది. కాబట్టి ఈ తరహా వార్తలు బూమ్ రాంగ్ అయ్యే పరిస్థితి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: