జగన్‌ వాలంటీర్ల బ్రహ్మస్త్రం.. బాబుకు మైనస్‌?

ఏపీ సీఎం గా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.  ప్రతి 50 కుటుంబాలకు ఓ వాలంటీర్ ను నియమించి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందించారు.  ఆ తర్వాత కొన్ని రోజులకు వీరిని క్రమబద్ధీకరించకపోవడం.. జీతాలు పెంచకపోవడం ఇలా తదితర కారణాల చేత పలువురు వీటిని వదిలి ప్రత్యామ్నాయ కొలువులపై దృష్టి సారించారు.

దీంతో స్థానికంగా ఉంటూ పది, ఇంటర్ చదవిన వాళ్లు వీటికి అప్లై చేసుకొని వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. ఇంట్లో ఖాళీగా ఉండే బదులు వాలంటీర్ గా పనిచేస్తే నెలకు రూ.5వేలు అయినా వస్తున్నాయి కదా అని కొంతమంది ఆలోచిస్తున్నారు.  సీఎం జగన్ తాజాగా వాలంటీర్ల చేత ప్రచారం చేయిస్తున్నారు. ఇది కచ్చితంగా ఈ వ్యవస్థను మిస్ యూజ్ చేయడమే.

ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అని చెప్పండి అంటూ సీఎం జగన్ వాలంటీర్లకు పిలుపునిచ్చారు.  దీంతో ఎల్లో మీడియా ఒక్కసారిగా దీనిపై పలు కథనాలను ప్రచురితం చేసింది.  కాకపోతే ఇదంతా జగన్ ట్రాప్ అని విశ్లేషకులు అంటున్నారు.  ఈ ట్రాప్ లో ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు పడతారా లేదా అనేది చూడాలి.

ఎలా అంటే సీఎం ఈ తరహా ప్రకటన చేశారు. కాబట్టి టీడీపీ, జనసేనలు ఈసీ వద్దకు వెళ్లి వాలంటీర్లను ఆపేయాలి అని ఫిర్యాదు చేస్తే.. అందుకు అనుగుణంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటే.. వీళ్లని పక్కన పెడతారు.  ఇప్పటి వరకు అలవాటు పడిన ప్రజలు వీళ్లని సంక్షేమ పథకాల గురించి అడుగుతారు. అప్పుడు చంద్రబాబు, పవన్ లు మమ్మల్ని తీసేయించారు వాలంటీర్లు చెబుతారు. తద్వారా భవిష్యత్తులో ఈ కూటమి అధికారంలోకి వస్తే మమ్మల్ని తీసేస్తారు అనే అభద్రతా భావం ఇటు వాలంటీర్లలో కూడా ఏర్పడుతుంది. ప్రజలు కూడా సంక్షేమ పథకాలు ఆపేస్తారు అనే భ్రమలో ఉంటారు. ఇది ఏ విధంగా చూసినా.. వైసీపీకి లాభం చేకూరుస్తుంది. మరి దీనిని టీడీపీ ఎలా అధిగమిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: