మోదీ ప్రచారంపైనే జగన్ ఆశలు?

ఏపీలో పాత కూటమి మళ్లీ కొత్తగా ఆవిష్కృతమైంది. 2014లో కలిసే పోటీ చేసిన టీడీపీ, జనసేన , బీజేపీ లు మరోసారి తన కాంబోని రిపీట్ చేశాయి. ఈ మేరకు మూడు పార్టీల మధ్య సంప్రదింపులు పూర్తయ్యాయి. పోటీ చేసే సీట్ల స్థానాలపై కూడా స్పష్టత వచ్చింది. ఇక మిగిలింది అభ్యర్థుల పేర్ల ప్రకటనే.

అయితే మరో వారంలో సార్వత్రికానికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. షెడ్యూల్ ప్రకటించిన వెను వెంటనే ఏపీలో వరుసగా మూడు రోజుల పాటు విశాఖ పట్నం, ఏలూరు, చిలకలూరిపేట  లో బీజేపీ, జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో మూడు భారీ బహిరంగ సభలు జరగనున్నాయి. ఎన్నికల ముంగిట స్వయంగా ప్రధాని నరేంద్రం మోదీ వీటికి హాజరు కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. సహజంగా ఇది ప్రజలపై ప్రజలపై ప్రభావం చూపేదే. దీంతో పాటు పలు రోడ్ షో ల్లో కూడా మోదీ పాల్గొననున్నారు.

ఇలా వరుసగా మోదీ ఏపీలో ప్రచారం చేయడం సంచలనమే. ఇవి కూడా బీజేపీ పోటీ చేసే స్థానాల్లో ప్రచారం నిర్వహించడం ఆ పార్టీకి బూస్టింగ్ ఇస్తుందనడంలో సందేహం లేదు.  ఈ పర్యటన జగన్ కు కొంత ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మోదీ ని జగన్ ఇప్పటి వరకు విమర్శించలేదు.

కానీ నరేంద్ర మోదీ తన ప్రత్యర్థి అని భావిస్తే వారిని ఏకి పారేస్తారు. 2019లో చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏపీలో సభ నిర్వహించి.. తన కుమారుడి కోసం చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని.. పోలవరాన్ని ఏటీఎంలా మార్చుకున్నారని విమర్శించారు. ఇవి ప్రజల్లో కొంత వ్యతిరేకతను తీసుకువచ్చాయి. ఇప్పుడు జగన్ ను ఏ విధంగా విమర్శిస్తారో అని వైసీపీ కలవరపాటుకు గురవుతుంది. దీనికి కౌంటర్ ఎటాక్ ఏ విధంగా చేయాలో ఇప్పటి నుంచే మదన పడుతోంది. సహజంగా ప్రధాని మాటకు విలువ ఎక్కువ ఉంటుంది.  ఆయన స్థానిక నాయకుల మాదిరి అడ్డగోలు ఆరోపణలు చేయరు. ఇవి తటస్థ ఓటర్లను ఆలోచనలో పడేస్తాయి. ఇది వైసీపీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: