టీడీపీ ఆర్థిక దిగ్బంధనం.. జగన్‌ వ్యూహం?

ఈ సారి ఎన్నికల్లో టీడీపీ ని కోలుకోలేని దెబ్బ కొట్టాలని జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో గత ఎన్నికల్లో టీడీపీకి ఆర్థికంగా అండగా ప్రతిపాటి పుల్లారావు, నారాయణలు నిలిచారు. ఈసారి మాత్రం ఈ ఇద్దరూ గందరగోళంలో ఉన్నారు.  జగన్ వీరిని లక్ష్యంగా చేసుకున్న నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోక కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అపెక్సా కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ జీఎస్టీ ఎగవేత, బోగస్ ఇన్వాయిస్ లతో నిధులు మళ్లించారనే ఆరోపణలతో ఏపీ రాష్ట్ర డైరెక్టరేట్ ఆప్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్ ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విజయవాడ మాచవరం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ మల్లికార్జున రావు ఉత్తర్వులు జారీ చేశారు.

మాచవరం పోలీసులు నమోదు చేసిన కేసులో నిందితుడు ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్ ను విచారణ నిమిత్తం పది రోజుల కస్టడీకి ఇవ్వాలని చేసిన అభ్యర్థనను విజయవాడ ఒకటో అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ర్టేట్ కోర్టు న్యాయాదికారి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ.. అత్యవసరంగా పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ అప్పీల్ పై విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

మరోవైపు తనను వేధింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలతో మాజీ మంత్రి పొంగూరి నారాయణ మరదలు పొంగూరి కృష్ణ ప్రియ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నెల్లూరు బాలాజీ నగర్ పోలీసులు ఈ ఏడాది మార్చి 4న పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మాజీ మంత్రి నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది సెక్షన్ 498ఏ వ్యవహారమని అరెస్టు విషయంలో తొందరపాటు చర్యలొద్దని పోలీసులకు సూచిస్తామని దుష్యంత్ రెడ్డి మౌఖికంగా తెలిపారు. ఈ విచారణను కూడా  వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: