రేవంత్‌రెడ్డి, చంద్రబాబు రహస్యసమావేశం?

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజకీయాలు దిల్లీ కేంద్రంగా జరుగుతున్నాయి. ఏపీలో పొత్తులపై చర్చించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు గురువారం దిల్లీ వెళ్లారు. ఇదే సమయంలో తెలంగాణ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కూడా గురువారమే జరిగింది. ఈసమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లు వెళ్లారు.

దిల్లీ లో రెండు జాతీయ పార్టీల్లో కీలక సమావేశాలు నిర్వహిస్తున్న వేళ రాజధాని కేంద్రంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. కాకపోతే ఈ విషయం ఏ న్యూస్ ఛానళ్లో కవర్ కాకపోవడం గమనార్హం. తన రాజకీయ గురువు అయిన చంద్రబాబుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిశారని ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఇది సర్వత్రా చర్చనీయాంశం అయింది.

ఏపీలో ఈసారి ఎన్నికలు చంద్రబాబు నాయుడికి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు బీజేపీ తో పొత్తుల కోసం సంప్రదింపులు జరిపారు. బీజేపీ ద్విముఖ వ్యూహంతో ఎన్నికలకు వెళ్తుండటంతో పొత్తులు నిన్నటి వరకు కొలిక్కి రావడం లేదు. ఈ తరుణంలో కాంగ్రెస్ కు సీఎం అయిన రేవంత్ రెడ్డి చంద్రబాబుతో బేగంపేట విమానాశ్రయంలో భేటీ కావడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. మరోవైపు ఇద్దరూ తాజా రాజకీయాలపై చర్చించుకున్నట్లు సమాచారం.

అయితే చంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు కలిశారు అనే దానిపై సందిగ్థం వీడటం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బాహాటంగానే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చింది. ఈ క్రమంలో బీజేపీ తమతో కలిసి రాకుంటే తాము ఇండియా కూటమివైపు చూస్తున్నామనే సంకేతాలు చంద్రబాబు పంపిచారు.. కాకపోతే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన వ్యూహం మార్చుకున్నారు. బీజేపీతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి ద్వారా చేరవేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: