జగన్ : మేనిఫెస్టోలో ఫోటో పెట్టుకునే దిక్కు లేదు.. హామీలు ఎలా అమలు చేస్తారు..?

murali krishna
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది.. నామినేషన్ల ప్రక్రియ కూడా మగిసింది. మరో రెండు వారాలలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగనున్నాయి.. దీనితో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో జోరు చూపిస్తున్నాయి..ఇటీవల అధికార పార్టీ వైసీపీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. పాత పధకాలను కొనసాగిస్తూ వాటి పరిధిని ఇంకాస్త పెంచింది.. మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంధంలా భావించి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన వైసీపీ పార్టీకి ఓటు వేయాల్సిందిగా జగన్ ప్రజలను కోరారు. ఇలా ఉంటే నేడు ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో రిలీజ్ అయింది.. తాజాగా అన్నమయ్య జిల్లా కలికిరి ప్రచార సభలో సీఎం జగన్‌ ప్రసంగిస్తూ ఎన్డియే మేనిఫెస్టో పై  కీలక వ్యాఖ్యలు చేశారు. 

టీడీపీ-జనసేన మేనిఫెస్టోపై మోడీ ఫొటో పెట్టవద్దని ఢిల్లీ నుంచి వాళ్లకు ఫోన్‌ వచ్చిందని జగన్ తెలిపారు.ముగ్గురు కూటమిలో ఉండి.. ముగ్గురి ఫోటోలను మేనిఫెస్టోలో పెట్టుకునే పరిస్థితి ఇప్పుడు చంద్రబాబుకు లేదని అన్నారు.. జగన్‌కు ఓటు వేస్తే పథకాలు అన్ని మరో ఐదేళ్లు ఎలాంటి డోకా లేకుండా నేరుగా లబ్దిదారునికి అందుతాయాని జగన్ తెలిపారు. అదే చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలు పూర్తిగా ఆగిపోతాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. వదలి బొమ్మాలీ అంటూ పసుపు పతి మళ్ళీ లేస్తా ఉండాడు... మీ రక్తం తాగడానికి సిద్ధంగా వున్నాడు.. మీరు గనుక ఆదమరిచి ఓటు వేసారా ఇక అంతే సంగతులు అని జగన్ తెలిపారు.

చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని ఆయన వ్యాఖ్యానించారు.. చంద్రబాబు రైతులకు ఎప్పుడైన రైతు భరోసా ఇచ్చాడా అంటూ ప్రజలను ప్రశ్నించారు. జగన్ తెచ్చిన స్కీం అయిన రైతు భరోసాను చంద్రబాబు రెట్టింపు ఇస్తాడంటే ఎవరైనా నమ్ముతారా అంటూ ప్రశ్నలు గుప్పించారు. చంద్రబాబు ఎప్పుడైన రైతులకు ఒక్కరూపాయి అయినా మేలు చేశాడా అంటూ చంద్రబాబును జగన్ తీవ్రంగా విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: