యువతకు కూటమి నేతల బంపర్ ఆఫర్లు ఇవే.. యువత జాతకాలు మారనున్నాయా?

Reddy P Rajasekhar
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా యువత ఓట్లు కీలకమనే సంగతి తెలిసిందే. యువత ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీకి అనూకులంగా ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తాజాగా కూటమి మేనిఫెస్టో విడుదల కాగా కూటమి మేనిఫెస్టో అదిరిపోయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా యువతను దృష్టిలో ఉంచుకుని కూటమి నేతలు ప్రకటించిన హామీలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయని చెప్పాలి.
 
ఏపీ ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టోను ప్రకటిస్తామని చెప్పిన బాబు ఆ దిశగానే అడుగులు వేశారని మేనిఫెస్టో చూస్తే అర్థమవుతోంది. మేనిఫెస్టోలో చంద్రబాబు యువత సంక్షేమానికి ఊహించని స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చారు. మెగా డీఎస్సీకి సంబంధించిన ప్రకటన చేయడంతో పాటు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
 
ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి దిశగా అడుగులు వేయడంతో పాటు ఉద్యోగ కల్పనకు ప్రత్యేక ఎంప్లాయిజెంట్ జోన్లను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రోత్సాహకాలను అందజేయడంతో పాటు వాటి ద్వారా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలను కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మూతపడిన ప్రతి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని పునః ప్రారంభిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
 
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు ఉద్యోగాలను కల్పిస్తామని బాబు భరోసా ఇచ్చారు. ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాలు అభివృద్ధిపరచడంతో పాటు యువతను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు రాష్ట్రాన్ని వేదికగా మారుస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం డిజిటల్ లైబ్రరీలను స్థాపిస్తామని బాబు వెల్లడించారు. మెగా డీఎస్సీ మీదే తొలి సంతకం పెడతానని చంద్రబాబు చేసిన ప్రకటన యువతకు ఎంతో బెనిఫిట్ కలిగించనుంది. యువత కలలను నెరవేర్చేలా కూటమి హామీలు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: