జగన్ చెప్పాడంటే చేస్తాడు.. బాబు చెబితే చేయడు.. ఇద్దరి మధ్య తేడాలివే?

Reddy P Rajasekhar
కేవలం రెండు రోజుల గ్యాప్ లో అటు వైసీపీ మేనిఫెస్టో ఇటు కూటమి మేనిఫెస్టో విడుదలయ్యాయి. ఈ మేనిఫెస్టోలలో కూటమి మేనిఫెస్టో అరచేతిలో వైకుంఠం చూపించేలా ఉంటే జగన్ మేనిఫెస్టో వాస్తవాలకు దగ్గరగా ఉంది. జగన్ ఇచ్చిన హామీలు పరిమితమైన హామీలే అయినా చెప్పాడంటే చేస్తాడంతే అనే భావనను కలిగించడంలో జగన్ సక్సెస్ అయ్యారు. అదే సమయంలో చంద్రబాబు మాత్రం ఇచ్చిన హామీలను ఎప్పుడూ నిలబెట్టుకోలేదనే విమర్శలను మూటగట్టుకుంటున్నారు.
 
ఒకప్పుడు ఉచిత విద్యుత్ పై విమర్శలు చేసిన చంద్రబాబు మేనిఫెస్టోలో 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ప్రకటించారు. 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ, ఇతర హామీలను ప్రకటించి పార్టీని ఏపీలో అధికారంలోకి తీసుకొచ్చిన బాబు ఆ హామీలను తూతూమంత్రంగా అమలు చేసిన తీరును ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేరు. చంద్రబాబు తాజాగా ప్రకటించిన మేనిఫెస్టో నిజంగా అమలైతే ఏపీ ప్రజల జీవితాలే మారిపోతాయి.
 
అయితే ఆ మేనిఫెస్టో అమలు చేయడానికి వీలైన మేనిఫెస్టోనేనా అనే ప్రశ్నలకు మాత్రం నిస్సంకోచంగా, నిస్సందేహంగా అమలు సాధ్యం కాని హామీలని చెప్పవచ్చు. 50 ఏళ్లకే పింఛన్ అని ప్రకటిస్తున్న చంద్రబాబు ఆ హామీ వల్ల ఆర్థిక భారం ఎంత పెరుగుతుందో ఆలోచించడం లేదు. ఒక కుటుంబంలో నలుగురు చదువుకునే పిల్లలు ఉంటే నలుగురికీ తల్లికి వందనం స్కీమ్ ద్వారా 60,000 అందిస్తే రాష్ట్ర ఖజానా పరిస్థితి ఏమవుతుందో చెప్పాల్సిన అవసరం లేదు.
 
అన్ని వర్గాల ప్రజలకు గ్రాఫిక్స్ లో మాయా ప్రపంచం కనిపించేలా మేనిఫెస్టోలో చూపించిన బాబు కూటమి అధికారంలోకి వస్తే ఈ హామీలను అమలు చేస్తారో లేదో చూడాలి. కూటమి హామీలను అమలు చేయాలంటే ఇప్పుడు ఖర్చు చేస్తున్న నిధులతో పోల్చి చూస్తే రెట్టింపు నిధులు అవసరం అవుతాయి. కూటమి అధికారంలోకి వస్తే తర్వాత చూసుకుందాం అనే ధోరణిలోనే బాబు అమలు సాధ్యం కాని హామీలను ప్రకటించారని విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు. పథకాలను అమలు చేసే విషయంలో బాబు వేరని జగన్ వేరని చంద్రబాబు మాటల గారడీ చేసి మోసం చేస్తాడని ఇప్పటికే చాలా సందర్భాల్లో ప్రూవ్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: