ఆ ఒక్కటి అడక్కు సెన్సార్ రివ్యూ: వెరీ పాజిటివ్?

Purushottham Vinay
టాలీవుడ్ టాలెంటెడ్ స్టార్ హీరో అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత ఆ ఒక్కటి అడక్కు అంటూ ఒక డిఫరెంట్ కామెడీ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు ఫస్ట్ నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి.ఈ మూవీకి సంబంధించి పోస్టర్స్ సాంగ్స్ అలాగే టీజర్ ట్రైలర్ కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు మొత్తానికి సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అవుతోంది. చిలక ప్రొడక్షన్స్‌పై రాజీవ్ చిలక నిర్మించిన ఈ మూవీకి మల్లి అంకం దర్శకత్వం వహించాడు. ఇక అల్లరి నరేష్ సరసన పొడుగు బ్యూటీ ఫారియా అబ్దుల్లా కథానాయికగా నటించారు.ఈ మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ పొందింది. ఆ ఒక్కటి అడక్కు ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రానుందని ట్రైలర్ తోనే ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ వేసవి కాలంలో థియేటర్లలో నవ్వుల హంగామా సృష్టించబోతోంది.


ఈ సినిమా మొత్తం 2:14 గంటల పర్ఫెక్ట్ రన్‌టైమ్ తో రాబోతోంది. ఎక్కడ బోర్ కొట్టించకుండా సినిమాను తెరపైకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.ఆ ఒక్కటి అడక్కు యూనివర్సల్ పాయింట్ యూత్ కి కనెక్ట్ అవుతుందని ట్రైలర్ లోని డైలాగ్స్ తో ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ మూవీలో అల్లరి నరేష్ పెళ్లి చేసుకోవడానికి కష్టపడే రిజిస్ట్రార్‌ గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్‌గా కనిపించనున్నారు. ఇక హీరోయిన్ ఫరియా సిద్ది పాత్రలో కనిపించనుంది. వీరి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ పర్ఫెక్ఫ్ గా సెట్టయినట్లు తెలుస్తోంది.ఫస్ట్ హాఫ్‌లో పెళ్లి చూపులు సీన్, మ్యారేజ్ రిసెప్షన్ సీన్, అల్లరి నరేష్, వెన్నెల కిషోర్‌లతో మ్యారేజ్ బ్యూరో సీన్, జామీ లీవర్ పెర్ఫార్మెన్స్, స్వయంవర్ సాంగ్ బెస్ట్ పార్ట్‌గా ఉంటాయట. అలాగే ఇందులో వైవా హర్ష కామెడీ ఎపిసోడ్స్, షకలక శంకర్ సీన్స్ కూడా మరింతగా ఆకట్టుకోబోతున్నట్లు సెన్సార్ వారు చెబుతున్నారు.హీరో, హీరోయిన్, మురళీ శర్మ, గౌతమి కాంబినేషన్ లో వచ్చే సన్నివేశం ద్వితీయార్థంలో హైలైట్‌గా ఉంటుందని సమాచారం తెలుస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 1 వ తేదీన హైదరాబాద్ లో జరగనుంది.ఈ మూవీ మే 3 న రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: