పవన్ కల్యాణ్‌కు బాబు వెన్నుపోటు తప్పదా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు ఆడుతున్న రాజకీయ జూదంలో ఒంటరిగా మిగిలి పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ ప్రభావాన్ని ఎక్కడిక్కడ చంద్రబాబు చాలా తెలివిగా తగ్గిస్తూ  వస్తున్నారు.  తన అనుకూల మీడియా ద్వారా పవన్ బలాన్ని తక్కువ చేసి చూపించి 24 సీట్లకు ఒప్పించడంలో ఆయన సఫలీకృతం అయ్యారు.

మనకు బలం లేదని స్వయంగా పవన్ కల్యాణ్ చేత చెప్పించగలిగేలా చేశారు.  జనసేనకు కేటాయించే సీట్లలో కూడా కొణతాల రామకృష్ణ తో పాటు టీడీపీ సానుభూతి పరులను జనసేనలోకి పంపి ఆపార్టీ టికెట్ ఇచ్చేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ విషయం తెలిసి కూడా పవన్ ఒప్పుకుంటున్నారు. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఇరు పార్టీలు కలిసి ఉమ్మడి సమావేశాలు, సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ సంబోధించేటప్పుడు జనసేన అధ్యక్షుడిలా కాకుండా పవర్ స్టార్ అంటూ మాట్లాడుతున్నారు.

ఇది వినడానికి బాగానే ఉన్నా.. పవర్ స్టార్ అనేది సినీ రంగంలో ఉపయోగించాలి. ఇక్కడ ఓ పార్టీకి అధ్యక్షుడు కాబట్టి జనసేనాని అనే మాట్లాడాలి. అంటే ఎంత జాగ్రత్తగా పవన్ అభిమానులను కానీ.. జనసేన కార్యకర్తలను నొప్పించకుండా చాలా నీట్ గా ఆయన ప్రభావాన్ని తగ్గిస్తూ క్రేజ్ ను వాడుకుంటున్నారు. రాజమండ్రి రూరల్ సీటు విషయంలో టీడీపీకి, జనసేనకి మధ్య ఇప్పటికీ సయోధ్య కుదరలేదు.

కానీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి చంద్రబాబు తనకు హామీ ఇచ్చారు. ఈ సీటు నాదే అని ప్రకటించేశారు. ఈ విషయం ఇప్పటి వరకు పవన్ ధ్రువీకరించలేదు. కానీ తన అనుకూల మీడియా ద్వారా జనసైనికులను చంద్రబాబు ఆ విధంగా సిద్ధం చేస్తున్నారు.  అలాగే కొంతమంది జనసైనికులను పవన్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. తద్వారా పవన్ కు తన బలం ఏంటో ఆయనకి తెలుసు. పొత్తుల విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారని రాసుకొస్తున్నారు. ఇలా తామంతా తోడు ఉన్నామనే భావన కలిగించి పవన్ ను ఒంటరి చేసే కుట్రలు జరుగుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: