ఎన్నికల సమరం: జగన్ ధైర్యమంతా అదేనా?

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సీఎం జగన్ శంఖారావం పూరించారు. సిద్ధం పేరిట ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 70మంది సిట్టింగులను మార్చి జగన్  అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ సంఖ్య 100 వరకు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. వీలైనంత త్వరగా రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను మార్చి ఎన్నికల ప్రచారంలో ముందుండాలని జగన్ భావిస్తున్నారు.

మరోవైపు ప్రత్యర్థి పార్టీ పొత్తులతో వస్తే జగన్ మాత్రం సింగిల్ గా వస్తూ తన సత్తాని నమ్ముకున్నారు. వాస్తవానికి జగన్ మొండి ఘటం అని.. ఎవరి మాట వినరని.. తాను చెప్పిందే జరగాలని అనుకుంటారు అని ప్రచారం ఉంది. కాకపోతే విశ్వసనీయ సమాచారం మేరకు ఆయన అందరితో సరదాగా మాట్లాడి వారి సమాధానాలు వింటారు. కాకపోతే తాను చెప్పాల్సిన దానిని సూటిగా చెబుతుంటారు. ఎలాంటి మోహమాటాలకు పోకుండా.. నేను చూసుకుంటా అని చెప్పి హ్యాండ్ ఇచ్చే వ్యక్తిత్వం జగన్ ది కాదని సన్నిహితుల చెబుతుంటారు.

ఇటీవల కొందరు సీనియర్ నేతలు జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా వారు టీడీపీ తో బీజేపీ చేతులు కలిపే అవకాశం ఉంది. మన పరిస్థితి ఏంటని అడగ్గా..  మనం ఒక కోటి అరవై ఐదు లక్షల కుటుంబాలకు గానూ.. ఒక కోటి నలభై అయిదు లక్షల కుటుంబాలకు సంక్షేమం అందించాం అని జగన్ చెప్పారు. ఇందులో కనీసం 80శాతం మంది మనకి ఓటేయ్యరా.. ఇంటికి ఒక ఓటు వేసుకున్నా అన్ని ఓట్లు మనకే పడతాయి కదా..

అలాగే మనల్ని అభిమానించే కుటుంబాలు ఉన్నాయి. వాళ్లంతా మన వెంటే ఉన్నారు. అదే సందర్భంలో ఈసారి అత్యధికంగా బీసీలకు సీట్లు కేటాయిస్తున్నాం. ఆ సామాజిక వర్గానికి న్యాయం చేస్తున్నాం. మరోవైపు మీరు చెప్పిన నాయకులకే ఆయా సామాజిక వర్గాల్లో నామినేడెట్ పోస్టులు, బోర్డు డైరెక్టర్లు వంటి పదవులు ఇచ్చాం. వీరి ఓట్లు మనవైపు టర్న్ కావా.  మొత్తం ఉన్న నాలుగు కోట్ల ఓట్లలో రెండున్నర కోట్ల ఓటర్లు మనవైపే ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో మనం ఎందుకు భయపడాలి అని చెప్పినట్లు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: