పవన్ టూర్ రద్దు.. అసలేం జరిగింది?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు సిద్ధం అయ్యారు. దాని కోసం హెలీకాఫ్టర్ సిద్ధం చేసింది జనసేన. ప్రతీ జిల్లాలో మూడు సార్లు జనసేనాని పర్యటించేందుకు వీలుగా ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాలో జనసేన చీఫ్ పర్యటన రద్దైంది. షెడ్యూల్ ప్రకారం ఆయన మూడు రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించాలి.

పవన్ హెలికాఫ్టర్  ల్యాండింగ్ కు అధికారులు అవరోధాలు సృష్టించారని.. అందుకే పవన్ పర్యటన రద్దు చేసుకున్నట్లు జనసేన ప్రకటించింది. వైసీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని కావాలనే తమ పార్టీ అధినేతను ఇబ్బందులకు గురి చేస్తున్నారని జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. కాకపోతే అధికారులు మాత్రం విష్ణు కళాశాల ప్రాంగణంలోని హెలిపాడ్ ప్రాంతాన్ని 2018 నుంచి అనుమతించడం లేదని గుర్తు చేస్తున్నారు.

అయితే దీని వెనుక మరో కోణం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీని వెనుక మరో ఇతర కారణం ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హెలీపాడ్ అనుమతి కేవలం ఒక సాకు మాత్రమే అని పేర్కొంటున్నారు. పవన్ కల్యాణ్ ను జనంలోకి రాకుండా చేసేందకు వైసీపీ కుట్రలు చేస్తోంది అనే సానుభూతిని ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా లబ్ది పొందాలని జనసేన పార్టీ భావిస్తోందని చెబుతున్నారు.

మరోవైపు లోకేశ్ శంఖారావం ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో పవన్  టూర్ పెట్టుకున్నారు. గతంలో కూడా జనసేనాని వారాహి యాత్ర పెట్టుకొని చంద్రబాబు సభలు పెట్టడం ప్రారంభించగానే ఆయన దానిని ఆపేశారు. ఇప్పుడు కూడా లోకేశ్ కవరేజ్ కి ఇబ్బందులు కలగకుండా ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారనే ఆరోపణలు లేకపోలేదు. పొత్తుల వ్యవహారం కూడా కారణం కావొచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సహజంగా పవన్ ని ఆపితే ఆగే వ్యక్తిత్వం కాదు. విశాఖలో రెండు రోజులు ఉండి మరీ తన యాత్ర కొనసాగించారు.  చంద్రబాబు అరెస్టు సమయంలో జగ్గయ్యపేటలో పోలీసులు ఆపితే నడుస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించారు. అలాంటి పవన్ తగ్గారు అంటే సమ్ థింగ్ ఈజ్ రాంగ్ అని పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: