జగన్‌తోనే మేం.. తేల్చి చెప్పేశారుగా?

వైసీపీలో కాంగ్రెస్ పార్టీలో మార్పులు, చేర్పుల వ్యవహారం కాకరేపుతోంది. కొందరు ఇతర పార్టీ నేతల టచ్ లోకి వెళ్తున్నారు. కొందరు సిట్టింట్ ఎమ్మెల్యేలు, పక్క పార్టీల వైపు చూస్తున్నారు. దీంతో ఈ సారి టికెట్ దక్కని వారు పార్టీలు ఉంటారా? లేక పక్క చూపులు చూస్తున్నారా? అనే ప్రచారం జోరుగా సాగుతోంది.

అయితే అభ్యర్థుల్ని ముందుగా ప్రకటించి మిగతా పార్టీలను ఒత్తిడిలో నెడదామని భావించిన వైసీపీ అధినేత జగన్ కు ఈ వ్యవహారాలతో కొత్త టెన్షన్ మొదలైంది.  ముందస్తుగానే మార్పులు చేస్తే ఎన్నికల సమయానికి అంతా సర్దుకుంటుందని భావించిన వైసీపీకి పార్టీ నాయకుల మార్పు కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతోంది. ఇప్పటికే ఎంపీ బాల శౌరి, వంశీకృష్ణయాదవ్ లాంటి కీలక నేతలు జనసేనలోకి వెళ్లడంతో పాటు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణరెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి లాంటి నేతలు టీడీపీలోకి వెళ్లారు.

దీంతో పాటు మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలతో చర్చలు జరుపుతున్నారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో వారంతా మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కూడా పార్టీ మారుతారు అనే ప్రచారం సాగింది.  తనకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఎటు వంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా ఎమ్మెల్యేను చేశారని.. జీవితాంతం జగన్ తోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

ఇదే తరహాలో కందుకూరు ఎమ్మెల్యే మహేంద్ర రెడ్డి కూడా పార్టీ మారుతారు అని ప్రచారం సాగింది. ఆయన కూడా పార్టీ మారనని తేల్చి చెప్పారు. చిట్టి బాబు, సుధాకర్ బాబు తో పాటు పార్టీ మారుతారు అని ప్రచారం జరుగుతున్న పలువురు ఎమ్మెల్యేలు తామంతా జగన్ వెంటే అని ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కూడా కాంగ్రెస్ లో చేరతారు అనే ప్రచారం సాగింది. ఈ కథనాలపై ఆయన స్పందిస్తూ తాను వైసీపీని వీడేది లేదు అని స్పష్టం చేశారు. ఇది జగన్ కు శుభ పరిణామం అని విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: