జగన్.. కులాల లెక్కలు ఫలిస్తాయా?

సీఎం జగన్ మోహన్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతుంది. ఇందులో భాగంగా అయిదు విడతల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసింది. తాజాగా ఆరో విడత జాబితా కూడా విడుదల చేసింది. అయితే సామాజిక సాధికారిత కల్పించారు జగన్. మహిళలు, యువతకు పెద్దపీట వేశారు. కొన్ని చోట్ల కొత్తవారికి అవకాశం కల్పించారు.

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ తగిన ప్రాధాన్యం కల్పించారు. సామాజిక సాధికారతే ఆయుధంగా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మలి జాబితాలో అన్ని కులాల వారికి ప్రాతినిథా్యన్ని కల్పించారు. తాజాగా విడుదలైన ఆరోజాబితాలో నాలుగు లోక్ సభ, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిలను వైసీపీ ప్రకటించింది. అత్యంత ప్రతిష్ఠాత్మకం, కీలకంగా మారిన నర్సాపురం, గుంటూరు లోక్ సభ స్థానాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ రెండిటింతో పాటు రాజమండ్రి, చిత్తూరు(ఎస్సీ రిజర్వ్డ్) లోక్ సభ స్థానాలకు ఇన్ఛార్జిలను నియమించింది.

పార్టీలో తిరుగుబాటు నాయకుడిగా ఉన్న రఘురామ కృష్ణం రాజు ప్రాతినిథ్యం వహిస్తున్న నర్సాపురం స్థానానికి అడ్వకేట్ గూడూరి ఉమాబాలను ఇన్ఛార్జిగా నియమించారు.  ఈమె శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు. రాజమండ్రిని కూడా శెట్టి బలిజ సామాజిక వర్గానికి కేటాయించింది.  ప్రస్తుతం టీడీపీ జెండా ఎగురుతున్న గుంటూరు లోక్ సభ ఇన్ఛార్జిగా ఉమ్మారెడ్డి వెంకటరమణను బరిలో నిలిపింది.  ఈయన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు.

కృష్ణా జిల్లా మైలవరం ఇన్ఛార్జిగా యాదవ సామాజిక వర్గానికి చెందిన జడ్పీటీసీ సభ్యుడు తిరుపతిరావు యాదవ్ పేరును ఖరారు చేసింది. నెల్లూరు సిటీపై మరోసారి ప్రయోగానికి దిగింది. ఇదివరకు బీసీలకు ఇచ్చిన ఈ స్థానాన్ని ఈ సారి మైనార్టీలకు కేటాయించింది. ఎమ్మిగనూరు పద్మ శాలీ సామాజిక వర్గానికి చెందిన బుట్టా రేణుక కు, మార్కాపురం లో వైశ్యులు బలంగా ఉంటారు కానీ ఇప్పటి వరకు ఎవరూ కూడా ఎమ్మెల్యేగా ఎన్నికవలేదు. అందుకే దఫా అన్నా రాంబాబు వైశ్య సామాజిక వర్గానికి కేటాయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: