మంచి జర్నలిస్టులు.. ఇంకా మిగిలి ఉన్నారా?

ఉద్దేశపూర్వక తప్పుడు ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలు ఇవీ అని వెల్లడించడం ఉత్తమమైన పాత్రికేయ విలువలకు ప్రామాణికం అవుతుంది. మీడియా అంటేనే కత్తి మొనమీద నిల్చోడం లాంటిది. నిజాన్ని నిర్భయంగా మాట్లాడటం ఎవరికీ సాధ్యం కానీ అంశం. మనం కోరుకునేది నిజం కాదు. వాస్తవానికి ఏం జరుగుతుందో వినగలగాలి. దానికి సిద్ధంగా ఉండాలి.

ప్రస్తుతం పార్టీ ఆలోచనల ధోరణి మారింది.  ప్రస్తుతం పార్టీల ఎజెండా మారింది. ఏ విధంగా అంటే ఒకప్పుడు టీడీపీని విమర్శించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు అదే పార్టీతో పొత్తుకు సిద్ధం అయ్యారు. గత ఎన్నికల కు మందు బీజేపీతో విభేదించి ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన టీడీపీ అదే బీజేపీతో జట్టు కట్టేందుకు వెంపర్లాడుతోంది. అయితే కొన్ని పత్రికలు తమ విలువను కోల్పోతున్నాయి. మీడియా ముసుగులో ఏది చెప్పినా జనం నమ్ముతారు అనే ధోరణిలోనే ఇంకా కొన్ని పత్రికలు ఉన్నాయనేది వాస్తవం.

అయితే నిజాన్ని నిర్భయంగా అబద్ధంగా మార్చేస్తున్నారు. 2014-19సమయంలో ఏపీ గణనీయమైన ప్రగతి సాధించింది అని చెప్పేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. గతంలో ఎప్పుడూ ఈ తరహా వార్తలు వాళ్లు రాయలేదు. వాళ్లు చెప్పేది వీళ్లు చెప్పేది రాస్తూ.. అందులో లోపాలను ఎత్తి చూపేవాళ్లు. కానీ ఇప్పుడు ఏపీలో ఏం జరిగినా దానికి అవినీతి మరకలు అంటిస్తున్నారు. ప్రతి పథకంలో వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు.

అయితే మరో ప్రధాన పత్రిక  అధికార పార్టీకి అధికార పత్రికగా పనిచేస్తోంది. ఏం జరిగినా గొప్పగా జరిగిందని రాసుకొస్తుంది. ప్రజలంతా సుఖ సంతోషాలతో కళకళాడుతున్నారని భజన చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో నేతల మధ్య మాటల తూటాలు పేలుతాయి. ఇంకా సొసైటీలో కొంతమంది సమాజానికి మేలు చేద్దామనే జర్నలిస్టులు ఉన్నారు. వారికిది పరీక్షా సమయం. ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే వ్యవస్థలు దిగజారిపోయాయి. గత 30ఏళ్లలో ఎన్నడూ లేనంతగా తొలిసారిగా రాజకీయ నాయకులు, మీడియా, అధికారులు దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఇది సమాజానికి మంచిది కాదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: