చంద్రబాబు ముందు జాగ్రత్త అద్భుతం?

సోషల్ మీడియాలో రాజకీయ నాయకులు, కార్యకర్తలు  చేసేది, చేయాల్సింది.. ఆత్మస్తుతి, పరనింద. అయితే అప్పుడప్పుడు మరికొన్ని విషయాలపై కూడా వారు  స్పందించాల్సి ఉంటుంది. ఎన్నికల వేళ అలాంటి స్పందనలను కాస్త అదుపులో పెట్టుకోవాలని ఆ పార్టీ  కార్యకర్తలకు టీడీపీ సూచిస్తోంది. ఏయే విషయాలపై స్పందించాలి, ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో చెబుతూ ఓ లిస్ట్ విడుదల చేసింది. ఈ మూడు నెలలు టీడీపీకి మద్దతుగా సోషల్ మీడియాలో పని చేద్దామనుకునే వారికి , సొషల్ మీడియాను తమ భుజాలపై మోస్తున్న వారికి, దీని ద్వారా పార్టీకి ఉపయోగపడాలనుకునే వారికి సూచనలు అంటూ టీడీపీ అధికారిక ఎక్స్ వేదికగా చంద్రబాబు ప్రకటించారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో జరిగిన పనుల్ని పొగడండి లేదా ఇప్పుడు వైసీపీ తీసుకున్న నిర్ణయాలను విమర్శించండి.. అంతవరకే పరిమితం కండి అంటూ టీడీపీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసింది.

పొరపాటున కూడా జనసేన, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సినీ నటులపై స్పందించవద్దని స్పష్టం చేసింది. జనసేనతో పొత్తులోఉన్నాం కాబట్టి సీట్ల సర్దుబాటు వంటి విషయాలు అధిష్ఠానాలకు, అధినేతలకు వదిలేసి.. సోషల్ మీడియా యాక్టవిస్టులు కేవలం పార్టీ ప్రచారం పై దృష్టి సారించాలని కోరింది.  పార్టీ కోసం ఉపయోగపడే పోస్టులనే సోషల్ మీడియాలో పోస్టు చేయాలని పేర్కొంది. సంబంధం లేని పోస్టులు పెట్టడం వల్ల మనల్ని చూసి మరొకరు అదే దారిలో నడుస్తారని.. దీని వల్ల అంతిమంగా పార్టీకి నష్టం జరుగుతుందని తెలిపింది.

ఇంకా ఎవరైనా అలాంటి పోస్టులు హద్దులు దాటి పెడుతున్నట్లయితే అటువంటి వారిని గుర్తించి ఆ పోస్టులను డిలీట్ చేయించేలా చొరవ చూపాలంది.  లేకుంటే వాటిపై స్పందించకుండా వదిలేయాలని సూచించింది. జనసేన ముసుగులో, ఏదైనా కులం ముసుగులో ఐప్యాక్ పేటీఎం ఖాతాల నుంచి ఎవరైనా రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టినా.. మాట్లాడినా అటువంటి వారికి కూడా బదులు ఇవ్వకుండా స్పందించకుండా వదిలేసినట్లయితే వారే ప్రయత్నించి ఆఖరకు వారి కోరిక నేరవేరాక ఆగిపోతారని వెల్లడించింది. ఈ మూడు నెలలు వివాదస్పద పోస్టులకు దూరంగా ఉంటూ స్వీయ నియంత్రణ పాటిస్తూ వందమందికి మార్గదర్శకంగా ఉండాలని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: