ప్రశాంత్ కిశోర్ పశ్చాత్తాపం.. ఎంత నిజం?
వీరిద్దరి సమావేశాన్ని ఎల్లో మీడియా ఓ రేంజ్ లో చూపిస్తోంది. చంద్రబాబు ఏకంగా అధికారంలోకి వచ్చినట్లే ప్రచారం చేస్తోంది. అధికార పార్టీకి ఊహించని షాక్ అంటూ ఊదరగొడుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పనిచేసిన ప్రశాంత్ కిశోర్ ఆ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. ఆ సమయంలో పీకేను టీడీపీ అధినేత బందిపోట్ల దొంగగా అభివర్ణించారు.
అయితే వ్యూహకర్తగా పనిచేస్తున్నపార్టీని గెలిపించేందుకు ఎలాంటి వ్యూహాలైన పన్నుతారన్న విమర్శలు ఆయనపై ఉన్నాయి. ప్రస్తుతం చంద్రబాబుకు పనిచేస్తుండటంతో ఓ విచిత్ర ప్రచారం చేస్తోంది. అదేంటంటే.. 2019 ఎన్నికల తర్వాత జగన్ ప్రభుత్వ విధ్వంసకర విధానాలు, అతి త్వరలోనే అత్యంత చెడ్డపేరు తెచ్చుకోవడం చూసి ప్రశాంత్ కిశోర్ అంతర్మథనానికి లోనయ్యారు అంట. ఇలాంటి పార్టీ గెలుపు కోసమా నేనే పనిచేసింది అని ఆవేదనను ఆయన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసేవారు అంట. జగన్ ప్రభుత్వ విధానాలను బహిరంగ వేదికలపై పరోక్షంగా విమర్శించారు.
వైసీపీ వంటి విధ్వంసకర పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు సహకరించడం ద్వారా ఏపీకి అన్యాయం చేశారని మదనపడుతున్నట్లు.. దాన్ని సరిదిద్దుకోవడానికే ప్రశాంత్ కిశోర్ టీడీపీ కోసం పని చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందని ఎల్లో మీడియా రాసుకొచ్చింది. వైసీపీ మాత్రం గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తోంది.