ఆ విషయంలో జగన్ అద్భుతం..మెచ్చుకుని తీరాలి?

ఎవరూ మంచి చేసినా గుర్తు పెట్టుకోవడం, వాటిని సమర్థించడం మంచి పద్ధతి.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాల వల్లే ఇప్పటికీ ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోయారు. చంద్రబాబు ప్రవేశ పెట్టిన అన్న క్యాంటీన్ పథకం కూడా చాలా మంది నిరుపేదల ఆకలి తీర్చింది.  కాకపోతే జగన్ పై కోపంతో అతను ఏం చేసినా అందులో లోపాలను అటు టీడీపీ ఇటు ఎల్లో మీడియా ఎత్తి చూపుతూ అందులోని మంచిని గ్రహించలేకపోతున్నారు.

ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విద్యా రంగానికి విశేష కృషి చేస్తున్నారు. దీనిని అభినందిచాల్సింది పోయి విమర్శిస్తున్నారు. నాడు నేడు పేరుతో పాఠశాలల అభివృద్ధి చేసి వాటికి మౌలిక వసతులు కల్పిస్తున్నారు. అలాగే ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశ పెట్టారు. దీంతో పాటు జగన్ పుట్టిన రోజు సందర్బంగా నిరుపేద విద్యార్థులందరికీ ట్యాబ్ లు ఉచితంగా అందజేసి ఆదర్శంగా నిలుస్తున్నారు.

అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాల ఆధారంగా విద్యార్థులందరికీ టీచర్లు పాఠాలు బోధించాలన్నది జగన్ ఆలోచన. అందుకు కోట్ల రూపాయలు వెచ్చించి బైజూస్ తో ఒప్పందం కుదుర్చుకొని పిల్లలకు ట్యాబ్ ల ద్వారా పాఠాలు బోధిస్తున్నారు.   మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలనే ఉద్దేశంతో ట్యాబ్ లు అందజేస్తున్నామని ఇదో విప్లవాత్మక చర్య అని పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 4,34,185 మంది విద్యార్థులకు రూ.620 కోట్ల వ్యయంతో బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబులను ఏపీ ప్రభుత్వం అందిస్తోంది. ట్యాబ్ విలువ బయట మార్కెట్ లో రూ. 17500పైగా ఉంటుంది. దీంతో పాటు అందించే కంటెంట్ విలువ రూ.15,500 ఉంటుంది. అంటే ఒక్కో విద్యార్థికి రూ.33వేల లబ్ధి చేకూరనుంది.  మొత్తం మీద జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇది అందరూ మెచ్చుకోవాల్సిన అంశం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: