ఆంధ్రా దొంగ ఓట్ల పంచాయితీ.. ఆ పార్టీకే లాభం?

ఆంధ్రప్రదేశ్ లో బోగస్ ఓట్ల పంచాయతీ కొనసాగుతుంది. దీనికి కారణం ఆంధ్రలో టీడీపీ వర్సెస్ వైసీపీగా పోటాపోటీ మాటల యుద్ధమే జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ తో పాటు వివిధ దేశాల్లో స్థిరపడిన వారికి కూడా ఆంధ్ర ప్రదేశ్ లో ఓట్లు ఉన్నాయి. దీని వల్ల ఆంధ్రప్రదేశ్ లో బోగస్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని వీటిని తీసేయాలని ఈసీకి వైసీపీ కంప్లైంట్ ఇచ్చింది.


ఇదే సందర్భంలో టీడీపీ సైతం వైసీపీకి చెందిన ఓట్లు ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి. ఏ నియోజకవర్గంలో దొంగ ఓట్లు వేయించేందుకు ప్లాన్ వేస్తున్నారనే అంశాలతో టీడీపీ వైసీపీపై కంప్లైంట్ ఇచ్చింది. దీంతో పాటు దొంగ ఓట్లను తొలగించాలని కోరింది. ఇదే సమయంలో వైసీపీ కూడా టీడీపీకి హైదరాబాద్ లో చాలా మంది సపోర్టలు ఉన్నారు. వారు అక్కడ ఓటేస్తున్నారు. ఇక్కడ టీడీపీకి ఓటేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


మరి ఇలాంటి సమయంలో ఎలా అయినా నకిలీ ఓట్లను తీసేయాలని టీడీపీ కుట్రలను అడ్డుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తుంది. మొత్తంగా సెటిలర్ల ఓట్లతోనే ఆంధ్రలో రాజకీయాలు మారిపోతాయన్నట్లుగా వీరి వైఖరి తయారైంది. 175 నియోజకవర్గాల్లో మొత్తం అన్ని ప్రాంతాల్లో కచ్చితంగా బయటకు వెళ్లిన వారు ఉంటారు. అయితే అక్కడ వారికి ఓటు ఉందా లేదా అనేది రూఢీ కావాల్సి ఉంది. ఒక వేళ హైదరాబాద్ లో గనక ఓటు ఉంటే మాత్రం రాబోయే రోజుల్లో ఆంధ్రలో ఓటు వేసేందుకు వీలు ఉండదు.


కానీ టీడీపీ మాత్రం తమకు సంబంధించిన ఓట్లను అక్కడ ఇక్కడ ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తుందని వైసీపీ ఆరోపణలు చేస్తుంది. వైసీపీ తమకు అనుకూలమైన ఓట్లను ఉంచుకుని వ్యతిరేక ఓట్లను తీసేస్తుందని టీడీపీ ఆరోపిస్తుంది. ప్రస్తుతం ఈ పంచాయితీ  ఎన్నికల కమిషన్ దగ్గరకు చేరింది. ఇలా ఒక్కో చోట ఒక్కో రకమైన పంచాయితీ నడుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: