ఆ రంగంలో జగన్ ముద్ర.. చెరిపేయడం కష్టం?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఆరోగ్య శ్రీ అనే కార్డును తీసుకోచ్చి ప్రజలకు ఉచిత వైద్యం, గవర్నమెంట్ ఆసుపత్రుల్లోనే కాకుండా ప్రైవేటులోనూ చూపించుకునే విధానాన్ని తీసుకొచ్చారు. దీంతో ఎంతో మంది పెద్ద పెద్ద ఆపరేషన్లకు ఆరోగ్య శ్రీని వాడి ప్రాణాలు దక్కించుకున్నారు. అప్పటి వరకు గవర్నమెంట్ ఆసుపత్రుల వద్ద ఇబ్బందులు పడ్డ ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అంది ఎంతో మంది లబ్ధి పొందారు.
తర్వాత ఆరోగ్య శ్రీ లాంటి పథకాన్ని ఇప్పటి వరకు తీసేయలేరు. అదే సమయంలో చంద్రబాబు కూడా దాన్ని కొనసాగించక తప్పలేదు. ప్రస్తుతం సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రభుత్వ వైద్య శాలల తీరును మెరుగుపరుస్తున్నారు. ఆర్ఎంపీల మీద ఆధారపడకుండా లోకల్ క్లీనిక్ లు ఏర్పాటు చేశారు. సురక్ష స్కీం ద్వారా మెడికల్ టెస్టులు ఫ్రీ గా చేయడం ప్రారంభించారు. ఇందులో భాగంగా దాదాపు 50 వేల మందిని రిక్రూట్ చేసుకున్నారు.
వీరు ప్రతి గ్రామంలో ప్రజలకు ఫ్రీగా మందులు ఇవ్వడం టెస్టులు చేయడం లాంటి వి చేస్తుంటారు. పల్లెటూళ్లలో దవాఖానాలు లేని పరిస్థితి నుంచి ప్రతి పల్లెకు వైద్యం అందేలా జగన్ సర్కారు ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ తీసుకొచ్చిన ఈ వైద్య విధానం వల్ల ప్రైవేటు, కార్పొరేటు సంస్థలు నష్టపోతున్నాయని వారు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తుంది. మరి జగన్ అందుబాటులోకి తెచ్చిన సురక్ష స్కీంతో ఎంత మందికి లబ్ధి చేకూరుతుందో చూడాలి. ఈ స్కీం జగన్ సర్కారుకు అండగా నిలుస్తుందా లేదా వేచి చూడాలి.