టీడీపీలో రేవంత్‌ రెడ్డి సీన్‌ కనిపించే ఛాన్సుందా?

రేవంత్ రెడ్డి 2004 లో ఎమ్మెల్యే కాక ముందు టీడీపీలో పయ్యావుల కేశవ్, దూళిపాళ్ల నరేంద్ర ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వారు టీడీపీ తరఫున మంచి పోరాటం చేయడంలో అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో సిద్ధ హస్తులు. అయితే 2009 తర్వాత టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో వారితో సమానంగా వైఎస్సార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో మెరుగయ్యారు. అదే సమయంలో వైఎస్ మరణం తదనంతర తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి పోరాటం చేశారు.


అటు ప్రత్యేకంధ్రా కోసం టీడీపీ నుంచి దూళిపాళ్ల, పయ్యావుల కేశవ్ పోరాడారు. అయితే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కాక ముందే వీరు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో మాట్లాడిన వారు.. కానీ ప్రస్తుతం వీరి కంటే వెనక ఎమ్మెల్యే అయినా రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణలో సీఎం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి వీరిద్దరూ సీఎం అయ్యే అవకాశం ఉందా అంటే ఏ మాత్రం లేదనే చెప్పొచ్చు.


ఎందుకంటే టీడీపీ అనేది ప్రాంతీయ పార్టీ అది ఎన్టీఆర్ పెట్టిన పార్టీ. ప్రస్తుతం చంద్రబాబు, ఆ తర్వాత నారా లోకేశ్ మాత్రమే ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఉంటారు. కానీ మిగతా వారికి మంత్రులతో మాత్రమే సరిపెడతారు. అయితే రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరడమే ఆయన ముఖ్యమంత్రి కావడానికి కారణమని చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకంటే జాతీయ పార్టీలో ప్రతిభ చూపిన వారికి సీఎం అయ్యే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి చేసి చూపించాడు.


మరి దూళిపాల్ల, పయ్యావుల జీవితంలో ఒక్క సారైనా సీఎం అవ్వగలరా.. అసలు సమస్యే లేదు. ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ పాలనే ఎక్కువగా ఉంటుంది. కుటుంబం నుంచి తండ్రి లేదా కొడుకు, మామా, ఇలా మాత్రమే అయ్యే అవకాశం ఉంది. సాధారణ నేతలకు సీఎం దక్కడం అనేది ఒక కల అనే చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: