మెట్రో స్టేషన్‌లో వెంకీ మామ యాక్షన్ త్రివిక్రమ్ స్పీడు మామూలుగా లేదుగా..!

Amruth kumar
తెలుగు సినీ ఇండస్ట్రీలో క్లాస్ అండ్ మాస్ ప్రేక్షకులను ఒకేసారి మెప్పించగల హీరో విక్టరీ వెంకటేష్. ఆయన కామెడీ టైమింగ్‌కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పదునైన డైలాగ్స్ తోడైతే థియేటర్లు దద్దరిల్లాల్సిందే. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి క్లాసిక్ సినిమాలకు రైటర్‌గా పనిచేసిన త్రివిక్రమ్, చాలా కాలం తర్వాత వెంకటేష్ హీరోగా ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రేజీ కాంబో సెట్స్ మీద ఉండటంతో అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకాయి.



ఇటీవలే ఇండోర్ షెడ్యూల్‌ను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న చిత్ర బృందం, తాజాగా హైదరాబాద్‌లోని మలక్‌పేట్ మెట్రో స్టేషన్‌లో ఒక కీలకమైన ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరించింది. పక్కా కామెడీ-యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో, ఈ ఫైట్ సీన్ హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది. జనంతో రద్దీగా ఉండే మెట్రో స్టేషన్‌లో వెంకటేష్ తన మార్క్ యాక్షన్‌తో విలన్లను ఊచకోత కోయడం ఫ్యాన్స్‌కు ఐ-ఫీస్ట్‌లా ఉండబోతోంది.వెంకటేష్ సినిమా అంటేనే కడుపుబ్బ నవ్వించే కామెడీ ఉంటుంది. ఈ సినిమాలో కూడా వెంకీ మామ తనదైన శైలిలో వినోదాన్ని పండించబోతున్నారు. త్రివిక్రమ్ రాసిన ప్రాసలు, పంచ్ డైలాగ్స్ ఈ ‘ఆదర్శ కుటుంబం’లో మళ్ళీ నాటి ‘నువ్వు నాకు నచ్చావ్’ రోజులను గుర్తు చేస్తాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. చాలా ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ కుదరడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఖాయమనిపిస్తోంది.


ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మెజారిటీ పార్ట్ కంప్లీట్ అవ్వడంతో, మేకర్స్ అక్టోబర్ నెలలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సరిగ్గా దసరా కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. పండగ పూట ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో వెంకటేష్ కంటే మొనగాడు ఎవరూ లేరు. కాబట్టి ఈ దసరాకు బాక్సాఫీస్ వద్ద ‘ఆదర్శ కుటుంబం’ సునామీ సృష్టించడం గ్యారెంటీ!త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న పూర్తి స్థాయి చిత్రం ఇదే కావడంతో సోషల్ మీడియాలో అప్పుడే ట్రెండింగ్ మొదలైంది. వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. యాక్షన్ ఎంత ఉన్నా, త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తాయని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: