చేసిన పాపం.. చంద్రబాబును వెంటాడుతోందా?

టిడ్కో ఇళ్ల పథకం విషయంలో లబ్ధిదారులు దారుణ వంచనకు గురయ్యారు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు టిడ్కో విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యం లబ్ధిదారుల పాట శాపంగా మారింది. కిస్తీల చెల్లించలేదంటూ బ్యాంకు నుంచి ఏకంగా లబ్ధిదారులకు స్వాధీన హెచ్చరిక రావడం ఆందోళన కలిగిస్తోంది. అసలు గృహ ప్రవేశమే చేయని ఇంటికి కిస్తీలు ఎలా చెల్లిస్తారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. కానీ బ్యాంకులు మాత్రం 21మంది పేర్లతో పత్రికల్లో ప్రకటనలు జారీ చేయడం ఆందోళన కలిగిస్తోంది.

టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రప్రభుత్వ సింహభాగం సాయంతో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20లక్షల ఇళ్లు నిర్మించాలని భావించారు. కానీ సకాలంలో చంద్రబాబు సర్కారు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయింది. మూడు కేటగిరిల్లో టిడ్కో ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. కేటగిరీ 1 కింద 300 చదరపు అడుగుల ప్లాట్లను ఉచితంగా ఇస్తామని.. కేటగిరీ 2లో 365 చదరపు అడుగుల ప్లాట్లకు రూ.3.15లక్షలు, 430 చదరపు అడుగుల  ప్లాట్లను రూ.3.65లక్షలను బ్యాంకుల వద్ద లబ్ధిదారులకు రుణాలు ఇప్పించారు.

సరిగ్గా ఎన్నికల ముంగిట 2018లో ఈ ప్రక్రియ పూర్తైంది. కానీ ఇళ్ల నిర్మాణాలు మాత్రం చేపట్టలేకపోయారు. ఇంతలో ఎన్నికలు రావడం… అధికార మార్పిడి జరగడం పూర్తయ్యాయి. కానీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో వైసీపీ ప్రభుత్వం వీటి నిర్మాణాలపై దృష్టి సారించలేకపోయింది. దీంతో ఎడతెగని జాప్యం జరిగింది.

ఇప్పుడు ప్రశ్నంతా  ఈ డబ్బులు మొత్తం ఏమైనట్లు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ 20లక్షల ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తే చంద్రబాబు వాళ్ల పాలిట దేవుడు అయ్యేవారు. అంతకు ముందు రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మాణం చేపట్టిన రాజీవ్ గృహ కల్పన ఇళ్లు పూర్తి చేస్తే ఆయనకు పేరు వస్తోందని వాటిని ఆపేశారు. చంద్రబాబు ప్రారంభించిన టిడ్కో ఇళ్లు ఇవ్వలేదు. కానీ ఈ నెపాన్ని జగన్ పై నెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో పాపం చంద్రబాబుది అయితే దాని ప్రతిఫలం అమాయకులైన ప్రజలది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: