ఇజ్రాయెల్-హమాస్‌పోరు.. మూడో ప్రపంచ యుద్ధమేనా?
తమ దేశంపై దాడి చేసి అమాయకులను బలి తీసుకున్న శత్రు దేశంపై ప్రతీకారం తీర్చుకుంటుంది ఇజ్రాయెల్. భీకర దాడులు కొనసాగిస్తూ గాజాపై విరుచుకుపడుతుంది. ఇందులో అమాయకులు బలవుతున్నారని శాంతియుత వాతావరణం నెలకొల్పాలని ప్రపంచ దేశాలన్నీ సూచిస్తున్నా ఇజ్రాయెల్ లెక్క చేయడం లేదు. శత్రువులు ఎక్కడ ఉన్నా మట్టుబెట్టడమే తమ లక్ష్యమని చెబుతుంది.
హమాస్ తీవ్రవాదులకు ఆది నుంచి అండగా పాలస్తీనా ప్రభుత్వం ఉంది. ఎందుకంటే అక్కడి ప్రభుత్వాన్ని నడపించేదే హమాస్ తీవ్రవాదులు. వీళ్లు ఇజ్రాయెల్ పై నేరుగా సైన్యంతో బాహ్య యుద్ధానికి దిగితే అది వేరు. కానీ సామాన్య ప్రజలను చంపుతూ.. ఆడపిల్లలపై నగ్నంగా ఊరేగిస్తూ అత్యాచారాలు చేస్తూ ఆపై వాటిని వీడియో రూపంలో చిత్రీకరించి రాక్షసానందం పొందారు. ఇంతటితో ఆగకుండా చంటి పిల్లల దగ్గర నుంచి గర్భణీ ని కడుపులోని శిశువుని చీల్చి చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటుంటే పలు దేశాలు అడ్డు పడుతున్నాయి. వీరికి మద్దతు ఇచ్చినందుకు ఆ దేశం మూల్యం చెల్లించుకోవాల్సిందే.
భారీ యుద్ధానికే ఇజ్రాయెల్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇది మూడు నెలలు కావొచ్చు, ఆరు నెలలు కావొచ్చు. యుద్ధం అనివార్యం. ప్రస్తుతం ప్రపంచ ఉగ్రవాద దేశాలన్నీ ఏకం అవుతున్నాయి. తీవ్రవాదులకు రక్షణ కల్పించి.. ఆపై మాకు ఏం సంబంధం లేదని చెప్పే ఇస్లామిక్ దేశాల స్వభావం ఈ యుద్ధంతో తేలిపోతుంది. ప్రపంచంలోని తీవ్రవాదులను పెంచి పోషిస్తున్న ఇస్లామిక్ దేశాలు, వారి వెనుక ఉన్న అరబ్ దేశాలు ఎటువైపు ఉండనున్నాయో చూద్దాం. వీరు పాల్గొంటే ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉంది.