జగన్ కొత్త నిర్ణయం.. ఉద్యోగులు హ్యాపీయేనా?
కొందరు ఉద్యోగులు మాత్రం జీపీఎస్ బిల్లుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ తేవాలని డిమాండ్ చేస్తున్నారు. తమ వాదనలు వినకుండా ఈ బిల్లు తెచ్చిందని వారు ఆరోపిస్తున్నారు. సీపీఎస్ రద్దు విషయంలో ఇంతకుమించి చేయలేమని.. సర్దుకుపోవాలని ప్రభుత్వం ఉద్యోగులను కోరుతోంది. ఇందులో ఏమైనా లోపాలుంటే సరిచేస్తామని ప్రకటించింది. జీపీఎస్ తో ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని వివరిస్తోంది.
గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓపీఎస్ తీసుకువస్తానని చెప్పలేదని.. సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పారని ఈ సందర్భంగా వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఓపీఎస్ కు మధ్యే మార్గంగా జీపీఎస్ ను తీసుకు వచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇది కూడా చేయలేదని వారు చెబుతున్నారు. అసలు కాంట్రాక్ట్ ఉద్యోగాలను సృష్టించిందే చంద్రబాబు అని చెబుతుంటారు. 1995-2004 సమయంలో నే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలను తీసుకువచ్చారని చెబుతున్నారు. వీరికి ఉద్యోగ భద్రత కూడా లేదు.
ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో కొంత మందిని వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రమబద్ధీకరించారు. ఆ తర్వాత ఇప్పుడు జగన్ సుమారు 10 వేల మందిని క్రమబద్ధీకరించారు. ఎల్లో మీడియాకు మాత్రం ఇవేమీ కనిపించడం లేదు. వీటి గురించి ఎక్కడా ప్రస్తావించరు. జీపీఎస్ విషయంలో ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తూ ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వీటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టేముందే ఎటువంటి నిరసనలు, ధర్నాలు చోటు చేసుకోలేదు. తాజాగా వీరిని రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు.