ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి వెనుక అసలు రహస్యం?
పశ్చిమాసియాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, నానాటాకి పెరుగుతున్న ఇజ్రాయెల్ దూకుడు ప్రధాన కారణంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. మరొకటి అరబ్ దేశాలతో సాధారణ సంబంధాలకు ఇజ్రాయెల్ చేస్తున్న కృషి కాస్తో కూస్తో ఫలించేలా ఉన్నాయి. ఇవి హమాస్ ను కలవరపాటుకి గురి చేసి ఉండవచ్చు. కొంతకాలంగా పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్ పై అరబ్ దేశాల ఒత్తిడి తగ్గుతూ వస్తోంది. ఇదే సమయంలో అరబ్ దేశాల పెద్దన్నగా భావించే సౌదీ అరేబియా ఇజ్రాయెల్ తో పలు ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సిద్ధమైంది.
దీంతో అప్రమత్తమైన హమాస్ ఇది ఇలాగే కొనసాగితే పాలస్తీనాకు పూర్తి స్వాతంత్ర్యం రాదని భావించి ఉంటుంది. దీంతో పాటు తమకు నిధులు ఇవ్వదని భావించి ఈ ఒప్పందాన్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలని భావించి ఈ దాడులకు తెగబడినట్లు కనిపిస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై పగ తీర్చుకునేందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తూ వస్తోంది. ఈ క్రమంలో హమాస్ కు ఇజ్రాయెల్ పై దాడి చేసేందుకు అవసరమైన సాయుధ, ఆర్థిక తదితర వనరులను సమకూర్చిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఇజ్రాయెల్ అరబ్ దేశాలతో కలిస్తే ఇద్దరూ ఆర్థికంగా పరిపుష్టులవుతారు. దీంతో చమురు నిల్వల సమస్యలు ఎదురైనప్పుడు అన్ని దేశాలను కలుపుకొని వెళ్తారు. దీంతో అక్కడ ప్రత్యేమ ముస్లిం దేశం అంతమై అన్ని మతాల వారు ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ వాళ్ల దేవుడు తప్ప మరే ఇతర దేవుళ్లని వాళ్లు అంగీకరించరు. దీంతోనే పక్కా ప్రణాళికతో దెబ్బకొట్టాలనే దాడి చేశారు.