ఇండియాకు వెళ్లిపోతామంటున్న పాక్ జనం?
ప్రస్తుతం పాక్ లో సున్నీ, షియా వర్గాలు అని రెండుగా విడిపోయారు. గతంలో వేరే మతాలకు మాత్రమే మత ద్రోహ చట్టం వర్తించేది. ఇప్పుడు పాకిస్థాన్ లోని సున్నీ వర్గానికి చెందిన అధికారులు ఈ చట్టాన్ని షియా వర్గానికి కూడా అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాకిస్థాన్ అల్లకల్లోలంగా మారిపోయింది. గతంలో వేరే మతాల వారిని దెబ్బతీసేందుకు ఈ చట్టం ఉపయోగించుకుని షియా, సున్నీలు కలిసి అందరినీ ఏరి పారేశారు. ఆయా మతాలు లేకుండా చేశారు.
సున్నీల సంఖ్య ఎక్కువగా ఉండటం, షియాలపై మత ద్రోహ చట్టం అమలు చేస్తుండటంతో పాక్ లో ఉండలేము కార్గిల్ వద్ద సరిహద్దులు తెరవండి మేం ఇండియా వెళ్లిపోతాం అని పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని గిల్గిట్, బాలిస్తాన్ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. షియాకు సంబంధించిన మత గురువును పాక్ ఆక్రమిత కశ్మీర్ లో అరెస్టు చేయడం వల్ల పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి. ఆ మత గురువు చెప్పిన విషయం ఏంటంటే షియాలను కూడా మత ద్రోహులుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇలాంటి విషయం ఎక్కడా చెప్పినట్లు కూడా లేదు. దీన్ని మార్చుకోవాలని అనడంతో అతడిని అరెస్టు చేశారు. అక్కడి ప్రజలు పాక్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు.