ప్రశ్న: అమరావతిలో బాబు అన్ని వేల కోట్లు ఏంచేశారు?
హడ్కో నుంచి 2016 సెప్టెంబర్ నుంచి రూ.7500 కోట్లు అప్పు, ఏపీసీఆర్డీఏ పేరు మీద రూ.2000 వేల కోట్లు అప్పు తీసుకున్నారు. అమరావతిలో 33, 500 ఎకరాల ను తాకట్టు పెట్టి రూ. 4900 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. ఇది కేవలం రెండు నెలల్లో ఎన్నికలు వస్తాయనగా భూమిని తాకట్టు పెట్టి అప్పుగా తీసుకున్నారు. కేంద్రం నుంచి రాజధాని కోసం ఇచ్చిన ఖర్చు రూ. 2500 కోట్లు ఇచ్చింది.
ఇక్కడ ప్రధాన అంశం ఏమిటంటే పార్లమెంట్ వెనకాల నూతన పార్లమెంట్ భవనం కోసం కట్టిన ఖర్చు దాదాపు రూ.3 వేల కోట్లు కూడా దాటలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ లోనే ఇంత ఎక్కువ ఎందుకు ఖర్చయిందో మాత్రం తెలియడం లేదు. రూ.17 వేల కోట్లతో కేవలం నాలుగు బిల్డింగ్ లు, అరడజను అండర్ క్రన్ స్ట్రక్షన్ 14 కిలోమీటర్ల రోడ్డు.. నిర్మించారు.
ఒక వేళ కిలోమీటరుకు రూ. 2 కోట్లు వేసుకున్న 28 కోట్లు అవుతుంది. ఒక్కో బిల్డింగ్ కు 100 కోట్లు వేసుకున్నా.. 1000 కోట్లు అవుతుంది. కానీ ఆంధ్రలో అమరావతి కోసం రూ.17 వేల కోట్లు ఎలా ఖర్చు పెట్టారన్నదే ఇప్పటికీ ఎవరికీ అంతు పట్టడం లేదు. అక్కడ చూస్తే ఏమీ కనిపించడం లేదు. అడిగిన వారిని ఆంధ్ర దోషిగా చూపిస్తున్నారు.