ఆ సీటు ఎవరికి.. తేల్చుకోలేకపోతున్న జగన్?
దీంతో జగన్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ దెబ్బతీస్తాడోనని జగన్ నే కాంగ్రెస్ దెబ్బతీసింది. కేసులు పెట్టి మరీ జైలుకు పంపించింది. అనంతరం రాష్ట్ర విభజన ఉద్యమాలు వచ్చాయి. ఆ సమయంలో రాష్ట్రంలో మంత్రిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రి పదవికి రాజీనామా కూడా చేశారు. దీంతో ఆయనపై జగన్ కు ఎనలేని అభిమానం వచ్చింది.
అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో రెండు సార్లు పిల్లి సుభాష్ ఓడిపోయారు. 2014 లో ఓడిపోయారు. 2019 లో ఆయనకు టికెట్ ఇవ్వలేరు. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ మాత్రం తన కొడుక్కి టికెట్ ఇవ్వమని అడుగుతున్నారు. దీంతో మొత్తం రసకందాయంలో పడింది. కానీ జగన్ మాత్రం ప్రస్తుత ఎమ్మెల్యే చల్లమనేనికి ఇవ్వాలని అనుకుంటున్నాడు. దీంతో పిల్లి సుభాష్ చంద్రబోసును సర్దుకుపోవాలని జగన్ కోరితే కాదు నియోజకవర్గంలో కావాలంటే సర్వే చేయించండి ఆ తర్వాత మీరు టికెట్ కన్పర్మ్ చేయండని అడిగారని సమాచారం.
అనంతరం చేసిన సర్వే రిపోర్టు వచ్చిందని ఇందులో పిల్లి సుభాష్ కొడుకు కు టికెట్ వచ్చేసినట్లేనని ఆయన భావిస్తున్నారు. కానీ చెల్లుబోయినకు ఇస్తే మాత్రం గ్రౌండ్ లో పిల్లి సుభాష్ సపోర్టు చేయనని చెప్పినట్లు తెలుస్తుంది. కాబట్టి ముందు చూస్తే గొయ్యి... వెనక చూస్తే నుయ్యి అన్న చందంగా మారింది జగన్ పరిస్థితి. ఇటు ప్రస్తుత ఎమ్మెల్యేను కాదనలేని పరిస్థితి. అటు పిల్లిని కూడా కాదనలేని పరిస్థితి నెలకొంది. మరి టికెట్ ఎవరికి దక్కుతుందో ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.