ఈ సమస్య జగన్‌కు బిగ్‌ మైనస్‌ అవుతోందా?

కరెంటు కోతలు అనేవి ఈమధ్య ఏపీ లో ఎక్కువ అవుతున్నాయని అంటున్నారు జనాలు. ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో వాళ్లకి కరెంటు పోయిందని కూడా తెలిసే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్లు ఏసీ ఇళ్లల్లో, ఇన్వెర్టర్ల సహాయంతో నిరంతరంగా విద్యుత్ సదుపాయాన్ని కలిగి ఉంటారు. అయితే పేదల పరిస్థితి, మధ్య తరగతి వాళ్ళ పరిస్థితి అలా ఉండదు. వాళ్ల ఇళ్లల్లో ఇన్వర్టర్లు ఉండవు.

కరెంటు పోతే పడే కష్టాలు తప్ప. బాలింతలు ఉండే ఇళ్లలోనూ, చిన్న చిన్న పిల్లలు ఉండే ఇళ్లలోనూ, వయోభారంతో, అనారోగ్యాలతో మంచాన ఉండే పెద్దవారికి  ఈ కరెంటు కోత అతి పెద్ద సమస్య. అంతే కాకుండా ఇంటి నుండి జాబ్ చేసే వాళ్ళకి, అంటే వర్క్ ఫ్రం హోం జాబ్ చేసే వాళ్ళకి కూడా విద్యుత్ అనేది నిరంతరాయంగా అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు బెజవాడ, గుంటూరు ఇంకా చాలా చోట్ల  విద్యుత్ సదుపాయానికి నిరంతరాయంగా ఆటంకం ఏర్పడుతున్న పరిస్థితి.

అలాగే పల్లెటూర్లలో కూడా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. తరచుగా కరెంట్ కట్ అవ్వడం, మళ్లీ రావడం ఇలా ప్రతి ప్రతి 15 నిమిషాలకు ఒకసారి కూడా ఒక్కో ఏరియాలో కరెంట్ పోతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా సెలవు దినాల్లోనూ సెకండ్ సాటర్డే రోజుల్లోనూ గంటలు గంటలు కరెంటు లేని పరిస్థితి ఫేస్ చేస్తున్నారు జనాలు. మరి ఇదంతా ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుసో, లేదో అని అడుగుతున్నారు జనాలు.

ఎన్నికల ముందు వాగ్దానాలు  అందరూ చేస్తారు కానీ ఆ తర్వాత దాన్ని  ఎంతవరకు నిలబెట్టుకుంటారు అనే దాన్ని బట్టి ప్రజలు నాయకులను నమ్ముతారు. అయితే జగన్మోహన్ రెడ్డికి సర్వే డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లేదా చుట్టూ ఉండే అధికార యంత్రాంగం ఫీడ్ ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్  ఇస్తూ ఉంటారు కానీ ఏసీల్లో ఉండే వాళ్ళు ఎంత ఫీడ్ బ్యాక్ ఇచ్చినా గ్రౌండ్ లెవెల్ లో జరుగుతుంది మాత్రం వాళ్లు చెప్పలేరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: