సంక్షోభం: ఆ అప్పులు చైనాను మింగేయబోతున్నాయా?

ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, చైనా రెండు దేశాలు ఆయా ప్రాంతాల్లో పెట్టు బడులు పెట్టి ముందుకు వెళ్లడంతో సత్తా ఉన్నవి. అయితే అమెరికా దెబ్బతింటే మిగతా దేశాలు కూడా ఆర్థికంగా కుంగిపోవడం ఖాయం. ఎందుకంటే అమెరికాతోనే చాలా దేశాలు ఉంటాయి. అయితే అమెరికాలో ఉద్యోగాలు చేసే వారు ఆర్థికంగా బలంగా ఉంటున్నారు. అమెరికాలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతే దాని ప్రభావం ఇండియా లాంటి దేశాల మీద ఉంటుందనేది సత్యం.


అమెరికాలో ఉద్యోగాలు పోతే ఇండియాలో వారి కున్న ఆస్తులు అమ్ముకుని వారికి డబ్బులు పంపించాల్సి ఉంటుంది. చైనా ఆర్థిక వ్యవస్థ పతనం అన్న విషయం అమెరికా, బ్రిటన్ , యూరోపియన్ దేశాలకు కలవరం పెడుతుంది. ఎందుకుంటే ఆర్థికంగా చైనా బలంగా ఉన్నప్పుడు చైనాలో ఈ అగ్రరాజ్యాలు ఆ దేశంలో పెట్టుబడులు పెట్టాయి. చైనా లార్జెస్ట్ ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నట్లు తెలుస్తోంది.


చైనాకు సంబంధించిన సంస్థల్లో ఉన్న నిధులు, షేర్ మార్కెట్ లో ఉన్న షేర్లను అమెరికాతో పాటు ఇతర దేశాల వారు అమ్మేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల చైనాలో షేర్ మార్కెట్ వాల్యూ తగ్గిపోతుంది. వివిధ దేశాల పెట్టుబడులు రావు. ఆర్థికంగా కుదేలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చైనా దీనిపై కాస్త ఆందోళనగానే ఉంది. చైనా వన్ రోడ్ వన్ బెల్ట్ నినాదం వల్ల  ఇప్పటికే లక్షల కోట్లను ఖర్చు చేసింది.


ప్రపంచం ఒక కుగ్రామంగా మార్చాలని ప్రతి దేశంలో చైనాకు సంబంధించిన వస్తువులు ఉత్పత్తి అమ్మకాలు నడవాలని కోరుకుంటుంది. ఇప్పటికే చైనా అప్పుల్లో కూరుకుపోయింది. ప్రావిన్స్ ల్లో కూడా చాలా అప్పులు పెరిగిపోయాయి. వాటి నుంచి ఎలా బయటపడాలో ఎవరికీ తెలియడం లేదు. పాకిస్థాన్ ఇంకా అప్పులు అడుగుతోంది. అయినా చైనా ఇస్తామని ఒప్పుకుంది. రాబోయే రోజుల్లో చైనా అప్పుల పాలు కావడం తప్పనిసరి. మరి జిన్ పింగ్ ఆలోచన ఎలా ఉందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: