వైసీపీ గుండెల్లో గుబులు రేపుతున్న కొత్త సర్వే?

ఇటీవల ఇండియా టుడే మూడ్ ఆఫ్‌ ది నేషన్ సర్వే ఏపీలో కలకలం సృష్టిస్తోంది. మహారాష్ట్ర కు సంబంధించి కూడా  సర్వే చేసింది. ఒక వేళ మూడ్ ఆప్ ది నేషన్ లో తెలుగు దేశంకు అనుకూలంగా గానీ సర్వే వచ్చినట్లయితే టీడీపీ అనుకూల మీడియా ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో తెగ వైరల్ చేసేసేవి. కానీ ఇండియా టుడే అలాంటిదేమీ ఇవ్వలేన్నట్లు తెలుస్తోంది.

మహారాష్ట్రకు సంబంధించిన చర్చలో రాజదీప్ సర్దేశాయ్ అడిగిన ప్రశ్నకు ఎన్డీఏ లో కూడా చేరేందుకు చాలా సీట్లు వచ్చే పార్టీలు అనుకూలంగా ఉన్నాయని బీజేపీ స్పోక్స్ పర్సన్ అన్నారు. మహారాష్ట్రలో షిండేే వర్గం కు 20 సీట్లు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు ఎన్డీఏ లో భాగస్వామి కావాలనుకుంటున్న పార్టీకి దాదాపు 15 నుంచి 20 సీట్లు వస్తాయని తెలిపారు.

టైమ్స్ నౌ ఆ మధ్య చేసిన సర్వేలో వైసీపీకి అనుకూలంగా రిపోర్టు ఇచ్చిందని అది పూర్తిగా వైసీపీ పార్టీకి అమ్ముడుపోయిందని అన్నారు. అదే సమయంలో ఇండియా టుడే రిపోర్టు ఇప్పుడు ఎందుకు నిజం కాకుడదని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అంటే టీడీపీకి దాదాపు 15 ఎంపీ స్థానాలు వస్తే రాష్ట్రంలో దాదాపు అసెంబ్లీలో కూడా విజయం సాధించినట్లే లెక్క.

కాబట్టి టీడీపీ, బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లే తెలుస్తోంది. బీజేపీతో పొత్తుకు సై అంటూనే వారి పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. బీజేపీ మాత్రం ఇంకా టీడీపీని నమ్మడం లేదు. గతంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి దాన్ని ఆయుధంగా చేసుకుని బీజేపీని పడగొట్టాలని ప్రయత్నం చేసింది. కానీ అప్పుడు బీజేపీ తమ మిత్రపక్షాలతో కలిసి అవిశ్వాసాన్ని ఎదుర్కొని ధీటుగా నిలబడింది. అప్పుడు కేంద్రంలోని బీజేపీ పార్టీ చేస్తున్న విధానాలను రాష్ట్రంలో ఎత్తి చూపడం వల్ల పూర్తిగా బీజేపీకి ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేసేలా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: