ఆ ఎన్నికల ఫలితాలు.. జగన్‌కు డేంజర్‌ సిగ్నలేనా?

గతంలో 2019 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన విజయాలను చవిచూసుకుంటూ వచ్చింది. అది కూడా 80% వరకు రిజల్ట్స్ సాధించడం అనేది అసలు మామూలు విషయం కాదు. 2019ఎలక్షన్స్ రిజల్ట్స్ సమయంలో అసలు ప్రతిపక్షం అనేది ఉంటుందా ఉండదా అనేంతగా ఈ ఫలితాలు ఆసక్తిని రేపాయి . అప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తో సహా అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన పరిస్థితి నెలకొంది అన్న విషయం మనకు తెలిసిందే.

అయితే ఒక విద్యార్థి పరీక్షల తర్వాత ఏ విధంగా అయితే రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడో అదే విధంగా  వైసిపి కూడా ఇప్పుడు రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తుందని తెలుస్తుంది. మున్సిపల్ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత  పార్లమెంటుకు సంబంధించిన ఉప ఎన్నికలు కావచ్చు, అలాగే అసెంబ్లీకి సంబంధించిన ఉప ఎన్నికలు కావచ్చు అన్నిట్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించుకుంటూ వచ్చింది ఇప్పటి వరకు.

అయితే మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం గట్టిగా దెబ్బతింది వైసిపి. దానికి సంబంధించిన మూడూ ఓడిపోయిన పరిస్థితి ఏర్పడింది‌. అయితే ఆ తర్వాత టీచర్ ఎలక్షన్స్ లో గెలిచింది కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల పరాజయం ముందు టీచర్ ఎన్నికల విజయం అనేది కనపడకుండా పోయింది. అయితే 34 పంచాయతీ స్థానాలకూ, అలాగే 245 వార్డు సభ్యుల స్థానాలకు మొన్న పోలింగ్ జరిగింది అన్న విషయం తెల్సిందే.

ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పోలింగ్ అనేది జరిగింది అని తెలుస్తుంది. ఆ తర్వాత కొంత విరామం తీసుకుని తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుండి ఓట్లను లెక్కించి విజేతలను నిర్ణయించడం జరిగింది. అయితే 34 స్థానాలకు గానూ, టీడీపీ 11స్థానాల్లో విజయం సాధిస్తే, 22 స్థానాల్లో వైఎస్సార్సీపీ  గెలుచుకుంది. 1 జనసేన గెలిచింది. ఇక వార్డుల విషయానికి వస్తే 130చోట్ల వైఎస్సార్సీపీ  గెలుపొందగా.. 94చోట్ల టీడీపీ గెలవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: