అయ్యో.. చంద్రబాబుకు ఏమైంది.. ఈ మాటలేంటి?

మేం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజల కోసం బాగానే పని చేశాం. కానీ ప్రతిపక్ష పార్టీలు, కొన్ని మీడియా సంస్థలు మాపై బురద చల్లాయి. తప్పుడు ప్రచారాలు చేయడంతోనే ఓడిపోయాం అని ప్రచారం చేసుకోవడం వరకు చంద్రబాబు, సీఎం జగన్ కు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ రాజకీయాల్లో పరిధి దాటి వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం ప్రారంభమై అవి కుటుంబ సభ్యుల క్యారెక్టర్లను తప్పు పట్టే వరకు వెళుతున్నాయి.

జగన్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ దత్తపుత్రుడు, దుష్టచతుష్టయం అని విమర్శలు చేస్తుంటే, చంద్రబాబు నాయుడు కాస్త శ్రుతి మించి సైకో, రాక్షసుడు, దుర్మార్గుడు అని తిడుతూ ప్రచారం చేస్తుంటే వాటి గురించి ఎల్లో మీడియా ఒక్కసారి కూడా ప్రస్తావించడం లేదు. జగన్ చంద్రబాబును ఆ ముసలోడు అంటున్న భాషను పదే పదే చూపిస్తున్న ఎల్లో మీడియా, చంద్రబాబు జగన్ ను సైకో, రాక్షసుడు అన్న దాన్ని ఎందుకు చూపించడం, రాయడం లేదని తెగ విమర్శలు చేస్తున్నారు.

చంద్రబాబు గారు ఒక బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ.. 45 రోజులు పూజలు చేసి రాఖీలు పంపించాను. అవి మీ ఇంట్లో పెట్టుకోండి మీ సమస్య వచ్చినపుడు తలుచుకోండి నేను మీకు పరిష్కారం చూపుతాను అని అన్నారు. అసలు 45 రోజలు పూజలు చేయడం ఏంటి? రాఖీలు దగ్గర పెట్టుకోవడం ఏంటీ? ఇలా ఎవరైనా చేస్తారా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా అని ప్రతిపక్షాలు, మేధావులు విమర్శిస్తున్నారు.

ఇదే జగన్ అంటే ఇప్పటికే ఎన్ని రకాల వార్తలు ప్రచురించే వారోనని అంటున్నారు.  మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆకాశంలో నక్షత్రాల మెరుస్తున్న మీ సెల్ ఫోన్లు కూడా కనిపెట్టింది నేనేనని అనడంతో అక్కడున్న వారితో పాటు ప్రతిపక్షాల నాయకులు కూడా కంగుతిన్నారు. చంద్రబాబు ఇలా మారిపోయాడేంటి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా ప్రసంగిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: