పోలవరంపై ప్రధాన పత్రిక అబద్ధాల రాతలు?

ఆంధ్రప్రదేశ్ ప్రజలతో మీడియా మైండ్ గేమ్ ఆడుతోంది. ఉదయాన్నే పేపర్ తెరవగానే అందులో వచ్చే వార్తలను చూసి ఏదో జరిగిపోతుందనే ఫీలింగ్ కు తీసుకొచ్చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాలుగేళ్లుగా వార్తలు రాస్తూనే ఉన్నారు. దీనిపై ఐవైఆర్ కృష్ణారావు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ గురించి ఓ ప్రధాన పత్రిక రాస్తున్న వార్తల్లో కేంద్రం గురించి కూడా అసత్య ప్రచారాలు చేస్తుంది. కాబట్టే స్పందించాల్సి వస్తోందని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ రిమార్కులు ఉన్నాయని అంటున్నారు. దీనిపై ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకోదని కేంద్ర మంత్రి మండలి తీసుకుంటుంది. అది ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కానీ పోలవరం పై కేంద్రం నిధులు ఇచ్చేందుకు నిరాకరించిందని వార్తలు రాస్తున్నారు. రూ. 23 వేల కోట్ల వరకు నిధులు నిరాకరణ చేశారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ఆలస్యం అవడానికి కారణాలు..  చంద్రబాబు గారి పాలనలో, జగన్ పాలనలో కూడా కాంట్రాక్టర్లు పని చేయకపోయినా కొనసాగించడం, రెండో అంశం.. తమకు అనుకూలమైన వారి గురించి ఆలస్యం చేయడం మూడోది సాంకేతిక సమస్యలు.

ప్రాజెక్టు నిర్మాణాల పునరావాస కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు నిర్మాణం ఎంత ఆలస్యమైనా దీని మీద పూర్తి స్థాయి విచారణ సమగ్రంగా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి విచారణలు జరిగినపుడు అసలు ఎక్కడ లోపం జరుగుతుంది. ఎవరూ పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగకుండా అడ్డకుంటున్నారని విషయం తేలిపోతుంది.

14 వేల కోట్ల తో నిర్మించాల్సిన ప్రాజెక్టును రూ. 55 వేల కోట్లతో నిర్మించడానికి చేసిన ప్రయత్నంలోనే అవినీతి దాగుందని తెలుస్తోంది. కేంద్రం నిధులు ఇస్తుందని తెలిసి ఇంతలా పెంచేయడం వెనక దాదాపు 50 వేల మంది అవినీతి పరులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు కాంట్రాక్టర్లను విమర్శించిన వైసీపీ నాయకులు కూడా వారికి మద్దతు తెలుపుతున్నారని ఐవైఆర్ కృష్ణారావు ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: