రేవంత్‌కు ఆ కుల నేతలతో చిక్కులు తప్పవా?

కాంగ్రెస్ పార్టీలో రోజుకో తగాదా ఉండటం సహజమే. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మొన్నటి వరకు ఎంపీ కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గా రెడ్డి లాంటి వారు తీవ్ర విమర్శలు చేసేవారు. reddy NALAMADA' target='_blank' title='ఉత్తమ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఉత్తమ్ కుమార్ రెడ్డి కి కూడా రేవంత్ అంటే పడేది కాదు. దీంతో రేవంత్  అనుకూల వర్గం.. వ్యతిరేక వర్గంగా కాంగ్రెస్ పార్టీ మారిపోయింది. అయితే ఖమ్మం సభకు రాహుల్ గాంధీ రావడం.. అందరూ కలిసిపోయారనుకుంటున్న తరుణంలో రేవంత్ రెడ్డికి మరో తలనొప్పి ప్రారంభమైంది.


మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఏకంగా బీసీలందరితో మీటింగ్ పెట్టి కాంగ్రెస్ లో వచ్చే ఎన్నికల్లో బీసీలకు పెద్ద పీట వేయాలని అన్నారు. బీసీలకు పార్లమెంట్ పరిధిలో మూడు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని, మెదక్ ఎంపీ స్థానం బీసీలకే ఇస్తూ మొత్తం మూడు ఎంపీ టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.


బీజేపీలో బీసీ నేత ఈటల రాజేందర్ ను అందుకే  ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా చేశారని కాంగ్రెస్ లో కూడా అలాగే బీసీలకు అవకాశం ఇవ్వాలని అన్నారు. ముఖ్యంగా బీసీలకు కాంగ్రెస్ లో ఆదరణ కరవైందన్నారు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న పొన్నాల లక్ష్మయ్య ఒక్కసారిగా బీసీల మంత్రం జపించడంతో కాంగ్రెస్ లో విభేదాలు బయటపడ్డాయి


ఈటల రాజేందర్ బీజేపీలో బీసీలకు ఎక్కువ సీట్లు ఇప్పించేందుకు కృషి చేస్తారు. బీసీ కార్డు చూపించి ఎలాగైనా తన తరఫున అభ్యర్థులను గెలిపించేందుకు ప్రయత్నిస్తారు. దీన్ని చూపి పొన్నాల లక్ష్మయ్య బీసీల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బీసీ క్యాండిడేట్ల కు టికెట్లు ఇవ్వాలని చెబుతున్నారు. తెలంగాణలో ఓసీలు, వెలమ సామాజిక వర్గం నుంచి ఓట్లు తక్కువగా ఉంటాయి. కానీ ప్రజాప్రతినిధులు ఎక్కువ మంది ఉంటారు. బీసీ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు తెలంగాణలో కాలేదు. మరి పొన్నాల బీసీ అస్త్రం ఫలిస్తుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: