పాలనలో కేసీఆర్‌, జగన్.. ఎవరు బెస్ట్‌?

సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మీ లాంటి పథకాలను తీసుకొచ్చారు. సెక్రటెరియేట్ కట్టుకున్నారు. కొన్ని విషయాల్లో ఎంతో అభివృద్ధి చేశారనడంలో సందేహం లేదు. మళ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో సెంటిమెంట్ రగిల్చాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ ఎంతో డెవలప్ అయిందని రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తుంటే ఆంధ్రలో కరెంట్ కోతలు పెడుతున్నారని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.

అయితే తెలంగాణలో అవినీతి పెరిగిపోయిందని ఏదైనా పని కావాలంటే లంచం పెడితేనే అవుతున్నాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ప్రజలు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారని చెబుతున్నారు. భారత దేశంలో అభివృద్ధిలో ఇప్పటికీ నెంబర్ వన్ ముంబయి ఉందని తెలుసుకోవాలి. ఆదాయ వనరుల పెంపులో ముంబయి, గుజరాత్ ఎప్పుడు ఉంటాయి.  రాష్ట్ర ప్రగతి రేటును చూసే ది జీఎస్డీపీ. అభివృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ 16.22 శాతంలో దేశంలో పస్ట్ ప్లేస్ లో ఉంది. సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తొమ్మిదేళ్ల కాలంలో ఏడున్నర లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తే, మిగులు బడ్జెట్ ఉన్న  తెలంగాణ లో కేవలం రూ. 5 లక్షల కోట్లు మాత్రమే ఇప్పటి వరకు ఖర్చు చేశాయని గణాంకాలు చెబుతున్నాయి.  

అలాగే ఆంధ్రప్రదేశ్ లో 13,500 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు ఉంటే తెలంగాణలో కేవలం 2149 కిలోమీటర్ల రహదారులు మాత్రమే ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణలో పోల్చుకుంటే రహదారుల అభివృద్ధి ఆంధ్రలోనే ఎక్కువ. అలాగే ఆంధ్రలో మొత్తం ప్రభుత్వ ఆసుపత్రులు 86 వేల ఆసుపత్రులు ఉంటే తెలంగాణలో 5 వేలు మాత్రమే ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఆంధ్ర తో పోల్చుకుంటే తెలంగాణలో ఎక్కువగా పేదరికం ఉందని లెక్కలు చెబుతున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు.

అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒక ఎకరం భూమి తడవాలంటే దాదాపు రూ. 30 వేల కరెంట్ బిల్లు వస్తుందని అంటున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణలో కంటే ఆంధ్రలోనే ఎక్కువగా సంక్షేమం జరుగుతోంది. అయితే డెవలప్ మెంట్ లో  ఆంధ్రను తక్కువగా, తెలంగాణను ఎక్కువగా ప్రొజెక్టు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: