అందులో తెలంగాణ కంటే ఏపీ కంటే ఎంతో బెటర్‌?

ఆంధ్రలో ప్రభుత్వ బడుల్లో చేస్తున్న మార్పులను తెలంగాణలో కూడా చేస్తే బాగుంటుందనేది ఆ రాష్టంలో వ్యక్తమవుతుంది. భావి తరాలకు పేద పిల్లలకు మనం ఇవ్వాల్సిన శక్తి చదువు. అన్ని స్కూళ్లలో పేద పిల్లలకు బైజుస్ శిక్షణ కూడా ఆంధ్రప్రదేశ్ ఇస్తోంది. టోపెల్ శిక్షణ కూడా 3 వ తరగతి నుంచి ఇచ్చేందుకు జగన్ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది.

కార్పొరేట్ విద్య కేవలం ప్రైవేటు పాఠశాలల్లో మాత్రమే కాకుండా ప్రతి స్కూళ్లలో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఉండాలని జగన్ ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం పెట్టి పేద విద్యార్థులకు అనర్గళంగా ఇంగ్లీషు నేర్పాలని చేస్తున్న ప్రయత్నం ప్రశంసనీయం. అభివృద్ది విషయంలో తెలంగాణలో వ్యవసాయానికి పెద్ద పీట వేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా భూముల ధరలకు రెక్కలు రావడం, సెక్రటరియేట్ కట్టడం, దళిత బంధు, కల్యాణ లక్ష్మీ లాంటి పథకాలు మెచ్చుకోదగినవి.

కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో జరుగుతున్న అభివృద్దిలో తేడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్య పై ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. ప్రభుత్వం నాడు నేడు పథకం అమ్మ ఒడి, విద్యా దీవెన లాంటి పథకాలతో ఎక్కువగా విద్యార్థుల కోసం ఖర్చు పెడుతోంది. దీని వల్ల విద్యార్థుల భవిష్యత్తు మెరుగు పడితే ఒక రకంగా రాష్ట్రానికి ఎక్కువగా లాభం చేకూరుతుంది. కానీ తెలంగాణలో విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆంధ్రలో ప్రవేశపెట్టిన పథకాల లాంటి వి తీసుకురావాలని కోరుతున్నారు.

ఆంధ్రలో చేస్తున్న విధంగా డిజిటల్ విద్యా బోధన కూడా తెలంగాణలో ప్రవేశ పెట్టాలని ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి. చేసిన అభివృద్దిని చూపించి ఓట్లగిడితే బాగుంటుంది తప్పా.. ఆంధ్ర, తెలంగాణ ఉద్యమం బావోద్వేగాల గురించి మాట్లాడి ఓట్లడిగితే ఈ సారి వచ్చే అవకాశం ఉండదని తెలుస్తోంది. ఏమైనా విద్యార్థుల భవిష్యత్ కోసం జగన్ చేస్తున్న కృషి ప్రశంసనీయమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: