చైనాతో ఘర్షణ.. రెడీగా ఉన్న ఇండియా?
అయితే తైవాన్ తో చైనా గనక యుద్దం చేస్తే దాన్ని అడ్డుకుంటామని అమెరికా చెప్పింది. కానీ చైనాను తక్కువ అంచనా వేయకుండా భారత్ అన్ని రకాలుగా సర్వ సన్నద్ధంగా ఉందని తెలుస్తోంది భారత్ ఆయుధ పరంగా, సైనిక పరంగా ఒక వేళ చైనాతో యుద్దం వస్తే చేయడానికి రెడీగా ఉంది. ముఖ్యంగా అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి అగ్రరాజ్యం కొన్ని సూచనలు చేసింది. ఇందులో ప్రముఖంగా భారత్ పై చైనా దాడి చేసే అవకాశం ఉందని చెప్పడంతో మోదీ మేం సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి దాడినైనా ఎదుర్కొని తీరతాం అని ప్రకటించారు.
ఇంతకు ముందులా అమెరికా, రష్యాల మీద ఆధారపడకుండా చైనాతో ఢీ అంటే ఢీ అనడానికి భారత్ సిద్దంగా ఉంది. ఒక వేళ డ్రాగన్ కంట్రీ యుద్ధానికి సిద్ధమైతే కచ్చితంగా పోరాడగల శక్తి ఇండియా వద్ద ఉందని చెబుతున్నారు. ఉక్రెయిన్ లా పరాయి దేశాల మీద ఆయుధ సంపత్తి కోసం ఆధారపడాల్సిన అవసరం లేదని తేల్చి చెబుతోంది.
చైనా తన సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో సరిహద్దు దేశాలతో ప్రతి సారి గొడవలకు దిగుతోంది. గాల్వాన్ లోయలో భారత సైనికులు తీవ్రంగా ప్రతిఘటించారు. దాదాపు 20 మంది సైనికులు కూడా అక్కడ అమరులయ్యారు. అనంతరం జరిగిన పరిణామాలతో ఇండియా చైనా సరిహద్దు ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించింది. ఎప్పుడు యుద్ధం వచ్చినా చేసేందుకు సిద్ధంగా ఉంది.