ఆ విషయంలో.. జగన్‌ సర్కారుపై కేంద్రం సీరియస్‌?

కేంద్రం మంజూరు చేసిన ఇళ్లకు జగనన్న ఇళ్ల పేరు పెట్టుకోవడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పల్లె ప్రాంతాలకు రూ.1.80 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2.80 లక్షలు ఇస్తుంది. ఆ స్థలాలకు కూడా 30 శాతం వరకు నిధులు కేంద్రం ఇస్తుంది. అయితే నీళ్లు, రోడ్లు, మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత.

అయితే ఆ మధ్య కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించినపుడు పీఎంజేవై అని పీఎం ఆవాస్ యోజన అనే లోగోలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కేంద్రం ఇస్తున్న నిధులు, డబ్బులతో ఇళ్లు కడుతున్నపుడు కనీసం కేంద్రం గురించి తెలియాలి కదా అన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇళ్లు కట్టిన ప్రాంతాల్లో మొత్తం జగనన్న ఇళ్లు అని పేరు పెట్టుకోవడంతో కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.

నిధులిస్తుంది కేంద్రం అయితే ఫోటోలు పేర్లు మీవి పెట్టుకుంటే ఎలా అని ప్రశ్నించారు. పీఎం ఆవాస్ యోజన,  పీఎం జేవై అనే లోగోలు పెట్టాలని చెప్పారు. మోదీ ఫోటో కూడా పెట్టండని చెబితే కరెక్ట్ ఉండేదని కొంతమంది అంటున్నారు. జగన్ ఫోటో ఇళ్ల వద్ద ఎలా పెట్టుకున్నారో మోదీ ఫోటో కూడా పెట్టాలని అడిగితే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.

కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రజా ప్రతినిధులు, మంత్రులు కేవలం అప్పటికప్పుడు ఇలా చెప్పి వెళ్లిపోతున్నారు తప్ప సీరియస్ గా తీసుకోవడం లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల జగన్ సర్కారు తమ ఆధిపత్య ధోరణి అవలంభిస్తోందని అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు బాగుంటే చూసీ చూడనట్లు వ్యవహరిస్తారని కొంతమంది ఆరోపిస్తున్నారు. బీజేపీ, వైసీపీ చాలా రోజుల నుంచి మిత్రులుగా ఉంటున్నారని తెలిసిన విషయమే. ఈ మధ్యే కేంద్ర హోం మంత్రి అమిత్ షా జగన్ ను విమర్శించే వరకు అంతా సాఫీగానే సాగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: