అమెరికా, చైనా: చర్చలు విఫలం.. సమరమేనా?

అయిదు సంవత్సరాల తర్వాత అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ఇటీవల చైనాలో పర్యటించారు. అయిదేళ్ల కిందట కూడా2018 లో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో పర్యటించిన అనంతరం ఇన్నాళ్లకు అమెరికా విదేశాంగ మంత్రి మళ్లీ చైనాలో పర్యటించారు. అయిత ఫిబ్రవరిలోనే బ్లింకెన్ చైనాలో పర్యటించాల్సి ఉండగా చైనా అమెరికాలో అనుమతి లేకుండాా ఒక బెలూన్ ను పంపింది. దీన్ని అమెరికా పసిగడ్డి గాల్లోనే పేల్చేయడం, చైనాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

అది నిఘా బెలూన్ అని పేల్చేశారు. అయితే తాజాగా జిన్ పింగ్ తో బ్లింకెన్ సమావేశ మయ్యారు. హట్ లైన్ ఏర్పాటు ను పునరుద్ధరించాలని చైనా కోరింది. అయితే దీన్ని చైనా తోసిపుచ్చింది. కుదరదని తేల్చి చెప్పింది. తైవాన్ విషయంలో కూడా అమెరికా జోక్యం చేసుకోవద్దని సూటిగా చెప్పేసింది. తైవాన్ చైనా లో అంతర్భాగమని అమెరికా విదేశాంగ మంత్రికి చెప్పి ఈ విషయంలో అమెరికా ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించింది.

చైనా అంతరంగిక వ్యవహారాల్లో తల దూర్చవద్దని చెప్పారు. ఆర్థిక, సరిహద్దుల విషయంలో చైనాపై ఎలాంటి చర్యలకు అమెరికా ఉపక్రమించిన ఊరుకునేది లేదని తెగేసి చెప్పారు. ఆయా సరిహద్దు ప్రాంతాల్లో మిలటరీలు ఏర్పాటు చేస్తే చైనా తగిన సమాధానం చెబుతుందని అన్నారు. అయితే ఈ చర్చలు ఏ మాత్రం పురోగతి లేకుండా సాగాయి.

జపాన్, ఆస్ట్రేలియా, భారత్ ఇతర దేశాల జోలికి వెళ్లొద్దని బ్లింకెన్ చైనాకు సూచించగా మా సరిహద్దు విషయంలో ఏ దేశం కూడా అత్యుత్సాహం చూపించినా తగ్గేది లేదని జిన్ పింగ్ అన్నారు. అమెరికా కూడా ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే బాగుంటుందని సలహా ఇచ్చాడు. అయిదేళ్ల తర్వాత జరిగిన అమెరికా, చైనా చర్చలు ఏ మాత్రం పురోగతి లేకుండానే ముగిశాయి. వివిధ దేశాల నిపుణులు చెబుతున్న ప్రకారం.. అమెరికా, చైనా చర్చలు విఫలమయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: