జగన్ అదృష్టం.. చేజారిపోతోందా?
ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి జాతీయ స్థాయి బీజేపీ నేతలతో మీటింగ్ లు పెట్టుకుంటున్నారు. పొత్తు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీకి ఆంధ్రలో పెద్దగా ఓట్ల శాతం లేకున్నా కేవలం కేంద్రం నుంచి జగన్ కు ఎలాంటి సాయం అందకూడదనే ప్లాన్ తో పవన్, చంద్రబాాబు సీరియస్ గా వర్కవుట్ చేస్తున్నారు. ఈ విషయంలో కాస్త విజయం సాధించినట్లే కనిపిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తే ఆంధ్రలో కచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే గతంలో జగన్ ఒక సవాల్ కూడా విసిరారు. ఆయా పార్టీలకు దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయమని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అయినా వాటిని పవన్ కల్యాణ్ గానీ చంద్రబాబు గానీ పట్టించుకోలేదు. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే రాష్ట్రంలో ఎలా ముందుకెళ్లాలి. సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టాం. ఇవిగో ఇంటింటికీ అందించిన పథకాలు అంటూ వెళితే ఓట్ల పడతాయా? లేక మూడు పార్టీల కలయిక కేవలం ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ఓడించడానికే అయ్యారని రివర్స్ ఎటాకింగ్ చేస్తారా?
ఏదేమైనా లోకల్ లో లోకేశ్ దూకుడు.. అటు చంద్రబాబు ఎత్తుగడలు, పవన్ కల్యాణ్ చరిష్మా, మరో వైపు బీజేపీ ఎక్కడ ఐటీ, ఈడీ దాడులు చేయిస్తుందోననే భయం. వీటన్నింటిని తట్టుకుని జగన్ ముందు కెళ్లాలి. ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పగలగాలి. పోలవరం, ఇతర ప్రాజెక్టుల పనితీరు వివరించగలగాలి. ఇలాంటి విషయాలు చెప్పడంలో జగన్ అయోమయానికి గురవుతున్నట్లు తెలుస్తోంది.