మోదీని దించేందుకు అంతర్జాతీయ కుట్ర?
మామూలుగా అయితే చైనాని యుద్ధంలో ఎదురుకోవడం కష్టమని అంటారు. అలాంటి చైనాని కూడా మోడీ నిలవరించి గలిగాడు అంటే మోడీ సత్తా పై ఇప్పుడు చైనాకి భయం పట్టుకుందని తెలుస్తుంది. చైనాకు సంబంధించిన మీడియా కూడా భారతదేశంలో మోడీని గద్దె దించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే అమెరికాకు చెందిన సోరోస్ సంస్థ కూడా ఇక్కడ బిజెపికి బదులు కాంగ్రెస్ను గద్దె ఎక్కించాలని ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది.
ఇప్పుడు ఈ దేశాలన్నీ కలిపి తమ మాట వినే ప్రభుత్వం, ప్రభుత్వ నాయకులు ఇక్కడ కేంద్రంలో ఉండాలన్నట్లుగా ప్రయత్నిస్తున్నాయని తెలుస్తుంది. అందుకే అవన్నీ కలిపి కాంగ్రెస్ ను గద్దెనిక్కించడానికి ప్రయత్నిస్తున్నాయట. నిజానికి చైనా, అమెరికా ఇంకా యూరప్ దేశాలు ఒకరికొకరు శత్రువులు. అయినా కూడా ఇప్పుడు భారతదేశంలో మోడీని అధికారంలోకి రానివ్వకుండా ఉండేందుకు వీళ్ళు ముగ్గురు ఇప్పుడు కలిసి పని చేస్తున్నారని తెలుస్తుంది.
ఎందుకు వీళ్ళందరూ మోడీపై కత్తి కట్టారు అంటే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అది ఇప్పటికే భారత దేశంలో మోడీ రెండుసార్లు స్థిరమైన మెజారిటీతో గెలవడంతో అంతర్జాతీయంగా ఆయనకి ఇన్ఫ్లూయన్స్ పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలకు భారత్ ఒక విలువైన దేశం గా కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. మోడీ గెలుపును, భారతదేశం గొప్పతనాన్ని ఒప్పుకోలేని ఈ చైనా, అమెరికా యూరప్ దేశాలు భారతదేశంలో మోడీ మళ్ళీ అధికారంలోకి రాకుండా తమ ప్రయత్నాలు తాము చేస్తున్నాయని తెలుస్తుంది.