జగన్‌పై యుద్ధానికి సిద్ధమవుతున్న చంద్రబాబు?
ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ ఉంటున్నందుకు నేను ఇది ప్రభుత్వానికి ఇచ్చేశానని ఆయన గతంలో చెప్పడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు కూడా లింగమనేని ఈ ఇంటిని ప్రభుత్వానికి ఇచ్చేశారని చెప్పడం జరిగింది. కానీ మొన్న ప్రతిపక్ష నాయకుడి స్థానంలోకి వచ్చాక ఈ ఇంటిని కూడా తన ఆస్తుల లెక్కలో చూపించారట చంద్రబాబు నాయుడు. అలాగే దీన్ని ప్రతిపక్ష నాయకుడి హౌస్ కింద అంటే, క్యాంప్ ఆఫీస్ కింద చూడమని అప్పటి ప్రభుత్వాన్ని కోరారట చంద్రబాబు నాయుడు.
మరి ఇప్పుడు ఈ ఇంటిని అటాచ్ చేశారన్నట్లుగా తెలుస్తుంది. దీన్ని బట్టి ఈ ఇల్లు చంద్రబాబునాయుడిదా, లింగమనేనిదా లేదా ప్రభుత్వానిదా అనేది తేలాల్సి ఉంది. చంద్రబాబుదే ఆ ఇల్లు అని ప్రభుత్వం చెప్తుంది. లింగమనేని ప్రభుత్వానిది అని చెప్తున్నారు. మరి దీనిపై చంద్రబాబు నాయుడు ఏం చెప్తారో చూడాలి. చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇంటినే అటాచ్ చేయడం ఇప్పుడు రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తుంది.
ఈ అటాచ్మెంట్ విషయం లో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేయబోతున్నారన్నట్లుగా తెలుస్తుంది. ఆందోళనలు కూడా జరగబోతున్నాయని అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబునాయుడు కి సంబంధించిన ఈ విషయం రాజకీయాల్లో వేడిని రాజేస్తుంది. మరి దీని ఎఫెక్ట్ రాబోయే కాలంలో రాజకీయాల్లో ఎలాంటి పాత్రను పోషించబోతుందో, ఎలక్షన్ల ఫలితాలు పై ఎటువంటి ప్రభావం చూపించబోతుందో అని అంటున్నారు కొంతమంది. మరి దీని ఫలితం గురించి తెలియాలంటే ఎలక్షన్ల ఫలితాలు వచ్చేవరకు ఆగాలి.